Google Pixel Watch 2 | అదిరిపోయే ఫీచర్లతో గూగుల్ ‘పిక్సెల్’ స్మార్ట్‌వాచ్ వచ్చేస్తోంది..! అవేంటో తెలిస్తే వావ్ అనకమానరు..!

Google Pixel Watch 2 | ప్రపంచం స్మార్ట్‌గా మారుతున్నది. చేతిలో స్మార్ట్‌ఫోన్ లేని మనిషి కనిపించడం లేదు. ఆ తర్వాత చాలా మంది స్మార్ట్ వాచ్‌లపై మక్కువ చూపిస్తున్నారు. హెల్త్ మానిటరింగ్, స్టయిలిష్ డిజైన్స్ తదితర ఫీఛర్లు ఉండడంతో వాటికి ధరించేందుకు మక్కువ చూపుతున్నారు. ఇప్పటికే మార్కెట్లోకి ఎన్నో మోడల్స్ స్మార్ట్‌వాచ్‌లు వచ్చాయి. ఈ క్రమంలోనే గూగుల్ కొత్త స్మార్ట్‌వాచ్‌ను విడుదల చేసేందుకు సన్నద్ధమవుతున్నది. ‘పిక్సెల్’ ఈవెంట్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది.
అక్టోబర్ 4న ‘పిక్సెల్’ ఈవెంట్
అక్టోబర్ 4న జరిగే ఈ వెంట్‌లో పిక్సెల్ 8 సిరీస్‌ను గూగుల్ కంపెనీ లాంచ్ చేయనున్నది. అయితే, ఈ ఈవెంట్‌లో పిక్సెల్ వాచ్-2ని సైతం విడుదల చేయనున్నట్లు తెలుస్తున్నది. అయితే, లాంచ్‌కు ముందే వాచ్‌కు సంబంధించి ఫీచర్స్ ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. పిక్సెల్ స్మార్ట్ వాచ్ ఫస్ట్ జనరేషన్ మోడల్‌ను పోలి ఉండనున్నది. రైట్ సైడ్‌లో రౌండ్ బెజెల్ లెస్ డిస్ప్లే, మెటల్ క్రౌన్ ఉండగా.. ఈ వాచ్‌ను వందశాతం అల్యూమినియంతో తయారు చేసినట్లు సమాచారం. ఇందులో కొత్తగా మూడు సెన్సార్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తున్నది. ఇందులో పాలిష్డ్ సిల్వర్, మాట్ బ్లాక్-ఓబ్సీడియన్, షాంపైన్ గోల్డ్- హాజెల్, పాలిష్డ్ సిల్వర్- పోర్సెలిన్ తదితర రంగుల్లో వాచ్ అందుబాటులో ఉండనున్నట్లు తెలుస్తున్నది. ఈ వాచ్‌కు మెటల్ స్లిమ్, యాక్టివ్ స్పోర్ట్ బాండ్స్‌ను గూగుల్ ఇవ్వనున్నది.
మల్టీ పాత్ హార్ట్‌రేట్ సెన్సార్, స్ట్రెస్ మేనేజ్మెంట్ సిస్టం..
ఈ స్మార్ట్‌వాచ్‌లో ఫిట్బిట్కి చెందిన మల్టీ పాత్ హార్ట్‌రేట్ సెన్సార్, స్ట్రెస్ మేనేజ్మెంట్ సిస్టం తదితరాలు ఉండనున్నట్లు తెలుస్తున్నది. వీటితో వ్యాయామాలను, ఒత్తిడితో శరీరంలో కనిపించే మార్పులను వాచ్ రికార్డు చేయనున్నది తెలుస్తున్నది. వీటితో పాటు అనేక హెల్త్, ఫిట్నెస్ ట్రాకింగ్ ఫీచర్స్, ఫాల్ డిటెక్షన్, ఎమర్జెన్సీ ఎస్ఓఎస్, హార్ట్ జోన్ ట్రైనింగ్, ఆరు నెలల ఫ్రీ ఫిట్‌బిట్ ప్రీమియం తదితర ఫీచర్స్ కూడా ఉన్నాయని తెలుస్తున్నది.
భారత్‌లో ఎప్పుడంటే..
గూగుల్ పిక్సెల్ వాచ్-2 స్మార్ట్ వాచ్‌లో 24 గంటల బ్యాటరీ లైఫ్ ఉండనుండగా.. కేవలం 75 నిమిషాల్లో ఫుల్ ఛార్జింగ్ అవుతుందని సమాచారం. వీటితో పాటు ఇంకా పలు సేఫ్టీ ఫీచర్స్‌ను సైతం గూగుల్ అప్‌డేట్ చేసిందని తెలుస్తున్నది. ఎమర్జెన్సీ సర్వీసెస్ సమయంలో మెడికల్ డేటాను సైతం షేర్ చేసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. అయితే, దీనిపై ఇప్పటి వరకు కంపెనీ ప్రకటించలేదు. అక్టోబర్ 4న జరిగే ఈవెంట్‌లో క్లారిటీ రానున్నది. ఇక వాచ్ భారత్‌లోనూ లాంచ్ కానున్నది. అక్టోబర్ 5న వివరాలను సంస్థ ప్రకటించే అవకాశాలున్నాయి.