Gorilla | మగ గొరిల్లా అనుకున్నారు.. బిడ్డకు జన్మనివ్వడంతో ఆశ్చర్యపోయిన జూ సిబ్బంది
Gorilla | విధాత: తమ దగ్గర ఉన్న గొరిల్లా చేసిన పనికి అమెరికా ఓహియోలోని కొలంబస్ జూ అధికారులకు అంతులేని అశ్చర్యం అనే పదానికి అర్థం తెలిసింది. నాలుగేళ్లుగా తాము మగది అని భావిస్తున్న ఒక గొరిల్లా.. బిడ్డకు జన్మనివ్వడంతో ఆశ్చర్యపోవడం జూ సిబ్బంది వంతయింది. గురువారం ఈ ఘటన జరగగా తాజాగా వెలుగులోకి వచ్చింది. సలీ అనే ఈ గొరిల్లా తమ వద్ద 2019 నుంచి ఉంటోందని కొలంబస్ జూ ఒక ప్రకటన విడుదల చేసింది. […]

Gorilla |
విధాత: తమ దగ్గర ఉన్న గొరిల్లా చేసిన పనికి అమెరికా ఓహియోలోని కొలంబస్ జూ అధికారులకు అంతులేని అశ్చర్యం అనే పదానికి అర్థం తెలిసింది. నాలుగేళ్లుగా తాము మగది అని భావిస్తున్న ఒక గొరిల్లా.. బిడ్డకు జన్మనివ్వడంతో ఆశ్చర్యపోవడం జూ సిబ్బంది వంతయింది. గురువారం ఈ ఘటన జరగగా తాజాగా వెలుగులోకి వచ్చింది. సలీ అనే ఈ గొరిల్లా తమ వద్ద 2019 నుంచి ఉంటోందని కొలంబస్ జూ ఒక ప్రకటన విడుదల చేసింది. బేబీ గొరిల్లాతో గురువారం ఇది తమకు కనిపించిందని, తల్లీ బిడ్డా ఆరోగ్యంగా ఉన్నాయని పేర్కొంది.
అయితే ఆడా మగా అయోమయంపై జూ అధికారులు వివరణ ఇచ్చారు. సలీ ఎప్పుడూ పూర్తి ఆరోగ్యంగా ఉండటంతో దాన్ని పరీక్షించాల్సి రాలేదని.. అందుకే దాని జెండర్‌ను కేవలం దూరం నుంచి చూసే కింది స్థాయి సిబ్బంది నిర్ధరించకున్నారని పేర్కొన్నారు. అంతరించిపోతున్న గెరిల్లా వానర జాతిలో ఒక కొత్త జీవి పుట్టడం సెలబ్రేట్ చేసుకోవాల్సిన విషయమేనని.. అయితే దానికి ఇప్పుడు కాస్త ఆశ్చర్యం తోడయిందని జూ సిబ్బంది చెప్పుకొచ్చారు. ‘సలీ దాని పిల్లకు పాలు ఇస్తున్నంత వరకు అది ఆడ గొరిల్లా అని తెలియలేదు.
యవ్వనంలో ఉన్న గొరిల్లా ఆడదా మగదా అని చెప్పడం కాస్త కష్టమైన పనే’ అని జూ వైద్య నిపుణుడు స్పందించారు. ‘గొరిల్లాలకు 8 ఏళ్లు వచ్చేవరకు వాటి మర్మావయవాలు అంతగా అభివృద్ధి చెందవు. 12 ఏళ్లు దాటిన తర్వాతే ఇవి ప్రత్యుత్పత్తికి పూర్తిగా సిద్ధమవుతాయి. సలీ వయసు ప్రస్తుతం 8 నుంచి 12 ఏళ్ల మధ్యలో ఉంటుంది. గొరిల్లాల పొట్ట కూడా పెద్ద గోనె సంచిలా ఉండటంతో అవి కడుపుతో ఉందనే విషయమూ మనకు తెలియకపోవచ్చు’ అని మరో వెటర్నరీ నిపుణుడు విశ్లేషించారు.
అంతరించిపోతున్న గొరిల్లాలు
ప్రపంచవ్యాప్తంగా 1956 నుంచి ఇప్పటి వరకు కేవలం 34 గొరిల్లాలు మాత్రమే జన్మించాయంటే వాటి సంఖ్య ఎంత తక్కువగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ గొరిల్లా జననంతో ప్రపంచంలోనే గొరిల్లా పిల్లకు జన్మనిచ్చిన తొలి జూగా కొలంబస్ జూ రికార్డు నమోదు చేసింది. ప్రస్తుతం ఈ బేబీ గొరిల్లా తండ్రిని కనిపెట్టడానికి జన్యు పరీక్షలు చేయనున్నామని సలీ సంరక్షకులు వెల్లడించారు. అయితే ఇక భవిష్యత్తులో ఎలాంటి గందరగోళాలకు తావు లేకుండా బేబీ గొరిల్లా జెండర్‌ను ముందే పరీక్షించి దానిని ఆడ గొరిల్లా అని సిబ్బంది నిర్దరించేసుకోవడం కొసమెరుపు.