TS RTC | టీఎస్ ఆర్టీసీ బిల్లుకు గవర్నర్ ఆమోదం
TS RTC విధాత: టీఎస్ ఆర్టీసీ బిల్లుకు గవర్నర్ తమిళసై సౌందరాజన్ ఎట్టకేలకు ఆమోదం తెలిపారు. గవర్నర్ ఆమోదంతో బిల్లు కొన్ని గంటల్లో అసెంబ్లీకీ చేరనుంది. ఆదివారం అసెంబ్లీ సమావేశాలకు చివరి రోజు కావడంతో ఇదే రోజు అసెంబ్లీలో ప్రభుత్వం ఆర్టీసీ బిల్లును ఆమోదించనున్నట్లు తెలుస్తోంది. గవర్నర్ మూడు దఫాలుగా అడిగిన అన్ని సందేహాలకు ప్రభుత్వం సమాధానాలు ఇవ్వడంతో బిల్లును గవర్నర్ ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీ మేరకు సత్వరమే ఆమోదించి ప్రభుత్వానికి పంపడం గమనార్హం. ఆర్టీసీ […]

TS RTC
విధాత: టీఎస్ ఆర్టీసీ బిల్లుకు గవర్నర్ తమిళసై సౌందరాజన్ ఎట్టకేలకు ఆమోదం తెలిపారు. గవర్నర్ ఆమోదంతో బిల్లు కొన్ని గంటల్లో అసెంబ్లీకీ చేరనుంది. ఆదివారం అసెంబ్లీ సమావేశాలకు చివరి రోజు కావడంతో ఇదే రోజు అసెంబ్లీలో ప్రభుత్వం ఆర్టీసీ బిల్లును ఆమోదించనున్నట్లు తెలుస్తోంది. గవర్నర్ మూడు దఫాలుగా అడిగిన అన్ని సందేహాలకు ప్రభుత్వం సమాధానాలు ఇవ్వడంతో బిల్లును గవర్నర్ ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీ మేరకు సత్వరమే ఆమోదించి ప్రభుత్వానికి పంపడం గమనార్హం.
ఆర్టీసీ ముసాయిదా బిల్లుతో పాటు గవర్నర్ ప్రభుత్వానికి పది సిఫారసులు చేస్తూ బిల్లును ఆమోదించి పంపించారు. గవర్నర్ చేసిన సిఫారసులపై సభలో బిల్లు ఆమోదం సందర్భంగా ప్రభుత్వం ఎలాంటి వైకరి అనుసరిస్తుందన్న అంశం ఆసక్తికరంగా మారింది. గవర్నర్ సిఫారసులను అనుసరించి బిల్లులో మార్పులు చేర్పులు ప్రభుత్వం చేస్తుందో లేదో వేచి చూడాలి.