Good news | ప్రయాణికులకు టీఎస్‌ఆర్టీసీ గుడ్‌ న్యూస్‌.. టికెట్‌ రేటుపై 10 శాతం డిస్కౌంట్‌..!

Good news | ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. టికెట్‌ ధరపై 10 శాతం డిస్కౌంట్ ప్రకటించింది. అయితే హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే వారికి మాత్రమే ఈ డిస్కౌంట్ వర్తించనుంది. ఈ రూట్‌లో ప్రయాణించే ప్రయాణికులకు టికెట్‌పై 10 శాతం రాయితీ ప్రకటించింది. అయితే ముందుగా బుక్ చేసుకున్న వారికే ఈ రాయితీ అని ఆర్టీసీ తెలిపింది.

Good news | ప్రయాణికులకు టీఎస్‌ఆర్టీసీ గుడ్‌ న్యూస్‌.. టికెట్‌ రేటుపై 10 శాతం డిస్కౌంట్‌..!

Good news : ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. టికెట్‌ ధరపై 10 శాతం డిస్కౌంట్ ప్రకటించింది. అయితే హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే వారికి మాత్రమే ఈ డిస్కౌంట్ వర్తించనుంది. ఈ రూట్‌లో ప్రయాణించే ప్రయాణికులకు టికెట్‌పై 10 శాతం రాయితీ ప్రకటించింది. అయితే ముందుగా బుక్ చేసుకున్న వారికే ఈ రాయితీ అని ఆర్టీసీ తెలిపింది. ఈ డిస్కౌంట్ ఆఫర్ తిరుగు ప్రయాణానికి కూడా వర్తిస్తుందని పేర్కొంది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

సాధారణంగా హైదరాబాద్ నుంచి విజయవాడ, విజయవాడ నుంచి హైదరాబాద్ ప్రయాణికులు పెద్ద సంఖ్యలో ప్రయాణం చేస్తుంటారు. ఈ మార్గల్లో ఆర్టీసీ బస్సులు సరిగా లేక ప్రయాణికులు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. అయితే ప్రైవేట్ ట్రాన్స్‌పోర్టుదారులు ప్రయాణికుల వద్ద భారీగా ఛార్జీలు వసూలు చేస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రయాణికుల భారం తగ్గించడానికి ఆర్టీసీ అధిక సంఖ్యలో బస్సులు నడపడంతో పాటు రాయితీని ప్రకటించింది.

తెలంగాణ ఆర్టీసీ నిర్ణయంతో విజయవాడ రూట్‌లో ఒక్కో ప్రయాణికుడికి రూ.100 వరకు ఆదా కానుంది. తెలంగాణ ఆర్టీసీ హైదరాబాద్-విజయవాడ మార్గంలో భారీగా బస్సులను పెంచింది. ప్రతి 10 నిమిషాలకు ఒక బస్సును టీఎస్ ఆర్టీసీ నడుపుతోంది. ఈ రూట్‌లో రోజు 120కి పైగా బస్సులు తిరుగుతున్నాయి. ఈ బస్సుల్లో లహరి ఏసీ స్లీపర్ బస్సులు 2, నాన్ ఏసీ స్లీపర్ కమ్ సీటర్ 2, ఈ గరుడ బస్సులు 10, గరుడ ప్లస్ 9, రాజధాని 41, సూపర్ లగ్జరీ 62 ఉన్నాయి. దీనికి సంబంధించి ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఎక్స్ లో పోస్ట్ చేశారు.