Bayya Sunny Yadav: పరారీలో.. భయ్యా సన్నీయాదవ్! ఎనీ టైం అరెస్ట్ చేస్తాం: డీఎస్పీ

విధాత : యూట్యూబర్ (YouTuber) భయ్యా సన్నీ యాదవ్(Sunny Yadav) అలియాస్ సందీప్ ను త్వరలోనే అరెస్టు చేస్తామని సూర్యాపేట డీఎస్పీ రవి ప్రకటించారు. సోషల్ మీడియా ఖాతాలలో (టెలిగ్రామ్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్‌బుక్) ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తూ వీడియో పోస్ట్ చేసి అమాయక యువత, ప్రజలను మోసపోయేలా చేస్తున్నాడని టీజీఆర్టీసీ ఎండీ, ఐపీఎస్ వీసీ సజ్జనార్ ట్విట్టర్ (ఎక్స్) వేదికగా అతడిపై ఫిర్యాదు చేశారు.
దీంతో సూర్యాపేట కమిషనరేట్‌లోని నూతన్‌కల్ పోలీస్ స్టేషన్‌లో బయ్యా సందీప్‌పై పోలీసులు కేసు నమోదు చేసి వివరాలను డీఎస్పీ రవి వెల్లడించారు. సన్నీ యాదవ్ పై సుమోటోగా కేసు నమోదు చేశామని తెలిపారు. . అతడు సోషల్ మీడియా ఖాతా లైన ఇన్ స్టా, ఫేస్‌బుక్, యూట్యూబ్‌లలో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నాడని తెలిపారు. ప్రస్తుతం సన్నీ యాదవ్ పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలిస్తున్నామని..త్వరలోనే అతడిని అరెస్టు చేస్తామని చెప్పారు.
ఐటీ చట్టం (2000-2008)లోని 111(2), 318(4), 46, r/w 61(2) BNS, 3, 4 TSGA, 66-C, 66-Dతో సహా అనేక సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని తెలిపారు. యువతకు హాని కలిగించడంలో యూట్యూబర్ సన్నీ యాదవ్ ప్రమేయం ఉందని తెలిపారు. రోజుకో కొత్త కాన్సెప్ట్ తో యువతను చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నాడని, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ ద్వారా రూ.8 కోట్ల ఇల్లు, జాగ్వర్ కారు, లక్షలు విలువ చేసే స్పోర్ట్స్ బైకులు సంపాదించాడని తెలుస్తుందన్నారు.
సజ్జనార్ హర్షం
కాగా తన పోస్టుపై స్పందించి కేసు సన్నీ యాదవ్ పై పోలీసులు కేసు నమోదు చేయడం పట్ల సజ్జనార్ హర్షం వ్యక్తం చేశారు. బెట్టింగ్ ఇన్‌ప్లూయెన్సర్లపై తాను చేసిన ‘ఎక్స్’ పోస్ట్ ఆధారంగా కేసు నమోదు చేసిన తెలంగాణ డీజీపీ, సూర్యాపేట ఎస్పీకి ధన్యవాదాలు తెలిపారు. కాసులకు కక్కుర్తిపడి అమాయకుల ప్రాణాలను తీస్తామంటే కుదరదని హెచ్చిరించారు. చట్టం ప్రకారం శిక్ష అనుభవించాల్సిందేనని.. మిలియన్లు, లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు.. డబ్బు కోసం ఏమైనా చేస్తామంటే ఊచలు లెక్కపెట్టక తప్పదని సజ్జనార్ హెచ్చరించారు.