Holidays | గ్రూప్-2 ఎగ్జామ్.. 29, 30 తేదీల్లో ప్ర‌భుత్వ సెల‌వులు

Holidays | రాష్ట్రంలో గ్రూప్-1 నిర్వ‌హ‌ణ త‌ర్వాత అత్యంత కీల‌క‌మైన గ్రూప్-2 రాత‌ప‌రీక్ష నిర్వ‌హ‌ణ‌కు టీఎస్‌పీఎస్సీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 29, 30 తేదీల్లో రెండు రోజుల పాటు నాలుగు పేప‌ర్లుగా ఈ గ్రూప్-2 ఎగ్జామ్‌ను నిర్వ‌హించ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో గ్రూప్-2 ఎగ్జామ్ సెంట‌ర్ల‌కు కేటాయించిన విద్యాసంస్థ‌ల‌కు సెల‌వులు ప్ర‌క‌టిస్తున్న‌ట్లు తెలంగాణ పాఠ‌శాల విద్యాశాఖ డైరెక్ట‌ర్ సోమ‌వారం ఉత్త‌ర్వులు జారీ చేశారు. తెలంగాణ‌లో 783 గ్రూప్-2 ఉద్యోగాల భ‌ర్తీ కోసం టీఎస్‌పీఎస్సీ నోటిఫికేష‌న్ విడుద‌ల చేసిన […]

Holidays | గ్రూప్-2 ఎగ్జామ్.. 29, 30 తేదీల్లో ప్ర‌భుత్వ సెల‌వులు

Holidays | రాష్ట్రంలో గ్రూప్-1 నిర్వ‌హ‌ణ త‌ర్వాత అత్యంత కీల‌క‌మైన గ్రూప్-2 రాత‌ప‌రీక్ష నిర్వ‌హ‌ణ‌కు టీఎస్‌పీఎస్సీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 29, 30 తేదీల్లో రెండు రోజుల పాటు నాలుగు పేప‌ర్లుగా ఈ గ్రూప్-2 ఎగ్జామ్‌ను నిర్వ‌హించ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో గ్రూప్-2 ఎగ్జామ్ సెంట‌ర్ల‌కు కేటాయించిన విద్యాసంస్థ‌ల‌కు సెల‌వులు ప్ర‌క‌టిస్తున్న‌ట్లు తెలంగాణ పాఠ‌శాల విద్యాశాఖ డైరెక్ట‌ర్ సోమ‌వారం ఉత్త‌ర్వులు జారీ చేశారు.

తెలంగాణ‌లో 783 గ్రూప్-2 ఉద్యోగాల భ‌ర్తీ కోసం టీఎస్‌పీఎస్సీ నోటిఫికేష‌న్ విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. గ్రూప్‌-2 ఉద్యోగాల కోసం 5,51,943 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఏడాది జనవరి 18 నుంచి ఫిబ్ర‌వ‌రి 16 సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 5,51,943 మంది ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు.

కాగా, ఒక్కో పోస్టుకు 705 మంది పోటీ ప‌డుతున్నారు. ఇక ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ, ఏర్పాట్లు, బందోబ‌స్తు త‌దిత‌ర విష‌యాల‌పై ఇప్ప‌టికే జిల్లా క‌లెక్ట‌ర్లు, ఎస్పీల‌తో టీఎస్‌పీఎస్సీ స‌మావేశాలు నిర్వ‌హించింది. ప‌రీక్ష తేదీకి వారం రోజుల ముందు హాల్ టికెట్లు జారీ చేయ‌నుంది.

వ‌చ్చే వారం గ్రూప్-4 ప్రిలిమిన‌రీ కీ విడుద‌ల‌..!

8 వేల‌కు పైగా గ్రూప్-4 పోస్టుల భ‌ర్తీకి నిర్వ‌హించిన రాత‌ప‌రీక్ష ప్రాథ‌మిక కీని వ‌చ్చే వారంలో విడుద‌ల చేసేందుకు టీఎస్‌పీఎస్సీ క‌స‌ర‌త్తు చేస్తోంది. అభ్యంత‌రాల అనంత‌రం తుది కీని ఖ‌రారు చేసి, ఫ‌లితాలు వెల్ల‌డించ‌నుంది. గ్రూప్-4 ప‌రీక్ష‌కు 7.6 ల‌క్ష‌ల మంది హాజ‌రైన సంగ‌తి తెలిసిందే.