Holidays | తెలంగాణ‌లో వ‌చ్చే వారంలో సెల‌వులే సెల‌వులు.. ఎన్ని రోజులో తెలుసా..?

Holidays | తెలంగాణ‌( Telangana )లోని విద్యార్థుల‌కు, ఉద్యోగుల‌కు గుడ్ న్యూస్. ఆగ‌స్టు( August ) మూడో వారంలో సెల‌వులే సెల‌వులు( Holidays ). పంద్రాగస్టు( Independence Day ) నుంచి మొద‌లుకుంటే.. రాఖీ పౌర్ణ‌మి( Rakhi Purnima ) వ‌ర‌కు వ‌రుస‌గా ఐదు రోజులు సెల‌వులు వ‌స్తున్నాయి. దీంతో విద్యార్థులు, ప్ర‌భుత్వ ఉద్యోగులు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు.

Holidays | తెలంగాణ‌లో వ‌చ్చే వారంలో సెల‌వులే సెల‌వులు.. ఎన్ని రోజులో తెలుసా..?

Holidays | తెలంగాణ‌( Telangana )లోని విద్యార్థుల‌కు, ఉద్యోగుల‌కు గుడ్ న్యూస్. ఆగ‌స్టు( August ) మూడో వారంలో సెల‌వులే సెల‌వులు( Holidays ). పంద్రాగస్టు( Independence Day ) నుంచి మొద‌లుకుంటే.. రాఖీ పౌర్ణ‌మి( Rakhi Purnima ) వ‌ర‌కు వ‌రుస‌గా ఐదు రోజులు సెల‌వులు వ‌స్తున్నాయి. దీంతో విద్యార్థులు, ప్ర‌భుత్వ ఉద్యోగులు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. వచ్చేవారారంతంలో కేవలం ఒక్కరోజు సొంతంగా సెలవు తీసుకుంటే మాత్రం.. ఏకంగా 5 రోజులపాటు వరుస సెలవులు రానున్నాయి.

ఆగస్టు 15 గురువారం స్వాతంత్య్ర దినోత్సవం, ఆగస్టు 16న వరలక్ష్మీ వ్రతం( Varalakshmi Vratam ), ఆగస్టు 18న ఆదివారం ఎలాగూ సెలవుదినమే. ఇక ఆగస్టు 19న రాఖీ పౌర్ణమి సందర్భంగా ఆరోజు కూడా స్కూళ్లు, కాలేజీలు, ఉద్యోగులకు సెలవు ఉంటుంది. మధ్యలో ఆగస్టు 17 శనివారం ఒక్కరోజు మాత్రమే పనిదినంగా వచ్చింది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల‌కు( Software Employees ) శ‌నివారం ఎలాగు వీకెండ్ ఉంటుంది. ఆగస్టు 15, 16, 18, 19 తేదీల్లో సెలవులు ఉన్నాయి. మధ్యలో ఆగస్టు 17 (శనివారం) ఒక్క రోజు మాత్రమే ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు వర్కింగ్ డే ఉంటుంది. ఈ ఒక్కరోజు ఏదోరకంగా సెలవు తీసుకుంటే.. ఏకంగా 5 రోజుల వరుస‌ సెలవులు రానున్నాయి.

ఆగ‌స్టు నాలుగో వారంలో కూడా వ‌రుస‌గా రెండు రోజులు సెల‌వులు రానున్నాయి. ఆగ‌స్టు 25న ఎలాగూ ఆదివారం సెల‌వే. ఆగస్టు 26న శ్రీ కృష్ణ జన్మాష్టమి ఉంది. ఈ రోజు కూడా సెలవు ఉంటుంది. మొత్తంగా చూస్తే ఆగస్టు నెలలో స్కూల్స్‌, కాలేజీల‌కు 10 రోజుల వ‌ర‌కు సెల‌వులు రానున్నాయి.

రాబోయే నెల‌ల్లో సెల‌వులు ఇలా..

-తెలంగాణలో ఈ ఏడాది దసరా సెలవులు అక్టోబర్ 2 నుంచి 14 వరకు 13 రోజుల పాటు ఉండనున్నాయి.
-సంక్రాంతి సెలవులు 2025 జనవరి 13 నుంచి 17 వరకు మొత్తం 5 రోజులు ఉంటాయని వెల్లడించింది.
-అక్టోబరు 31న దీపావళి
-డిసెంబ‌ర్ 23 నుంచి 27 వ‌ర‌కు క్రిస్మ‌స్ సెల‌వులు ఉండనున్నాయి.