గోవాకు వెళ్తున్నారా..? రూల్స్‌లో మారాయి.. ఇలా చేస్తే జేబులకు చిల్లులే..!

Goa Rules | పర్యాటక ప్రాంతమైన గోవా అంటే యూత్‌లో మంచి క్రేజ్‌ ఉంటుంది. ఎందుకంటే తక్కువ ధరకే ఇక్కడ మద్యం దొరుకుతుంది. ఇక్కడ ఎంజాయ్‌ చేసేది మద్యంతోనే. అక్కడి నుంచి మద్యం సైతం ఇండ్లకు తెచ్చుకుంటూ ఉంటారు. ఇదిలా ఉండగా.. గోవాలో రూల్స్‌ మారిపోయాయి. ప్రభుత్వం కొత్త నిబంధనలను అమలులోకి తీసుకువచ్చింది. ఈ క్రమంలో గోవా వెళ్లేవారంతా తప్పనిసరిగా ఈ రూల్స్‌ తప్పనిసరిగా తెలుసుకోవాలి. లేకపోతే జేబులకు చిల్లులుపడడం ఖాయం. గోవాకు వచ్చే పర్యాటకుల భద్రతను […]

గోవాకు వెళ్తున్నారా..? రూల్స్‌లో మారాయి.. ఇలా చేస్తే జేబులకు చిల్లులే..!

Goa Rules | పర్యాటక ప్రాంతమైన గోవా అంటే యూత్‌లో మంచి క్రేజ్‌ ఉంటుంది. ఎందుకంటే తక్కువ ధరకే ఇక్కడ మద్యం దొరుకుతుంది. ఇక్కడ ఎంజాయ్‌ చేసేది మద్యంతోనే. అక్కడి నుంచి మద్యం సైతం ఇండ్లకు తెచ్చుకుంటూ ఉంటారు. ఇదిలా ఉండగా.. గోవాలో రూల్స్‌ మారిపోయాయి. ప్రభుత్వం కొత్త నిబంధనలను అమలులోకి తీసుకువచ్చింది. ఈ క్రమంలో గోవా వెళ్లేవారంతా తప్పనిసరిగా ఈ రూల్స్‌ తప్పనిసరిగా తెలుసుకోవాలి. లేకపోతే జేబులకు చిల్లులుపడడం ఖాయం.

గోవాకు వచ్చే పర్యాటకుల భద్రతను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. వీటిని ఉల్లంఘించిన వారికి వేలల్లో జరిమానాలు విధించనున్నారు. ముఖ్యంగా బీచ్‌లో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిపై కఠిన చర్యలు తీసుకొనేందుకు ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. బహిరంగ ప్రదేశంలో ఆహారాన్ని వండితే రూ.50వేలు జరిమానా చెల్లించాల్సిందే. దాంతో పాటు గోవా ప్రభుత్వం కొత్త రూల్స్‌లో పర్యాటకులు వేరేవారిని ఫొటోలు తీసేముందు వారి అనుమతి తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది.

ముఖ్యంగా బీచ్‌లో సేరతీరేవారు, సముద్రంలో సరదాగా గడిపే సమయంలో వారి అనుమతి లేకుండా ఎట్టి పరిస్థితుల్లో ఫొటోలు తీయకూడదు. పర్యాటకులు రాళ్లు, ప్రమాదకరమైన ప్రదేశాల్లో సెల్ఫీలు తీసుకోవద్దని సూచించింది. అలాగే చారిత్రక కట్టడాలను పాడుచేయొద్దని విజ్ఞప్తి చేసింది. గోవా వచ్చే పర్యాటకులు పర్యాటక శాఖలో రిజిస్టర్ చేయబడిన హోటల్స్‌లోనే విడిది చేయాలని సూచించింది.

బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించినా, బహిరంగ ప్రదేశాల్లో వంట చేసినా భారీగా జరిమానాలు విధిస్తామని ప్రభుత్వం హెచ్చరించింది. గత జనవరి 26న ఆంక్షలను అమలులోకి తీసుకువచ్చింది. గోవాలో పర్యటించే పర్యాటకులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని స్పష్టం చేసింది. పర్యాటకుల గోప్యత, వారి భద్రత, మోసం నుంచి వారిని రక్షించడం వంటి ఉద్దేశంతోనే ఈ రూల్స్ అమల్లోకి తెచ్చినట్లు సర్కారు వివరించింది.