Goa Beach | గోవాలో బీచ్‌ల్లో మద్యం సేవించడంపై నిషేధం..!
Goa Beach | గోవా ప్రభుత్వం( Goa Govt ) మందుబాబులకు షాకివ్వబోతుందా..? అంటే అవుననే సమాధానం వస్తుంది. త్వరలోనే గోవాలోని బీచ్( Goa Beach )ల్లో మద్యం( Alcohol ) సేవించడంపై నిషేధం విధించబోతున్నట్లు సమాచారం. ఇవాళ గోవా అసెంబ్లీలో ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్( Pramod Sawant )మాట్లాడిన మాటలు మద్యం నిషేధానికి సంకేతమిస్తున్నాయి.

Goa Beach | పనాజీ : గోవా ప్రభుత్వం( Goa Govt ) మందుబాబులకు షాకివ్వబోతుందా..? అంటే అవుననే సమాధానం వస్తుంది. త్వరలోనే గోవాలోని బీచ్( Goa Beach )ల్లో మద్యం( Alcohol ) సేవించడంపై నిషేధం విధించబోతున్నట్లు సమాచారం. ఇవాళ గోవా అసెంబ్లీలో ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్( Pramod Sawant )మాట్లాడిన మాటలు మద్యం నిషేధానికి సంకేతమిస్తున్నాయి.
గోవా అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే మిచ్చెల్ లోబో మాట్లాడుతూ.. బీచ్‌ల్లో మద్యం సేవిస్తూ.. అక్కడే ఆ సీసాలను పడేస్తున్నారని, కొందరు వాటిని పగులగొడుతున్నారని, దాంతో పర్యాటకులకు గాయాలవుతున్నాయని సభ దృష్టికి తీసుకొచ్చారు.
దీంతో సీఎం ప్రమోద్ సావంత్ కలగజేసుకుని.. బీచ్‌ల్లో గ్లాస్‌తో కూడిన మద్యం బాటిళ్ల విక్రయంపై నిషేధం విధించేందుకు కసరత్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. సీసాల స్థానంలో కేన్స్ తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు.
అనంతరం టూరిజం మంత్రి రోహన్ కౌంటే మాట్లాడుతూ.. బీచ్‌ల్లో చెత్త వేసే వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తున్నామని తెలిపారు. చెత్త వేసే వారిపై రూ. 5 వేల నుంచి రూ. 50 వేల వరకు జరిమానా విధిస్తున్నట్లు తెలిపారు. అదే విధంగా గాజు సీసాలో మద్యం విక్రయాలపై నిషేధం గురించి ఆలోచిస్తున్నామని, దీనివల్ల కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉందన్నారు. దీనిపై సీఎంతో ఇటీవలే విస్తృతంగా చర్చించామన్నారు. అయితే మద్యం కొనుగోలు చేసే వారి వద్ద నుంచి ముందస్తుగానే కొంత డబ్బు డిపాజిట్ చేయించుకోవాలని, మద్యం సీసాలను తిరిగి ఇస్తేనే ఆ డబ్బును తిరిగి ఇవ్వాలనే నిబంధనను తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ నిబంధనలను త్వరలోనే అమల్లోకి తీసుకొస్తామని గోవా టూరిజం మంత్రి చెప్పుకొచ్చారు.