TSPSC | గ్రూప్-4పై కీలక అప్డేట్.. ఫలితాలు అప్పుడేనట..!
TSPSC | తెలంగాణలోని గ్రూప్-4 ఉద్యోగాల భర్తీకి ప్రక్రియ ప్రారంభమైన సంగతి తెలిసిందే. గ్రూప్-4 కింద మొత్తం 8,039 ఉద్యోగాల భర్తీకి ఇప్పటికే రాత పరీక్ష పూర్తయింది. ప్రాథమిక కీ వెలువడాల్సి ఉంది. ఈ కీని వారం రోజుల్లో ఇవ్వాలని టీఎస్‌పీఎస్సీ నిర్ణయించినట్టు సమాచారం. ఈ కీపై అభ్యంతరాలకు 7 రోజుల వరకు గడువు ఇచ్చే అవకాశం ఉంది. అభ్యర్థుల నుంచి వచ్చిన అభ్యంతరాలపై నిపుణులతో కమిషన్ పరిశీలించిన అనంతరం తుది కీని విడుదల చేయనుంది. గ్రూప్-4 […]

TSPSC |
తెలంగాణలోని గ్రూప్-4 ఉద్యోగాల భర్తీకి ప్రక్రియ ప్రారంభమైన సంగతి తెలిసిందే. గ్రూప్-4 కింద మొత్తం 8,039 ఉద్యోగాల భర్తీకి ఇప్పటికే రాత పరీక్ష పూర్తయింది. ప్రాథమిక కీ వెలువడాల్సి ఉంది. ఈ కీని వారం రోజుల్లో ఇవ్వాలని టీఎస్‌పీఎస్సీ నిర్ణయించినట్టు సమాచారం. ఈ కీపై అభ్యంతరాలకు 7 రోజుల వరకు గడువు ఇచ్చే అవకాశం ఉంది.
అభ్యర్థుల నుంచి వచ్చిన అభ్యంతరాలపై నిపుణులతో కమిషన్ పరిశీలించిన అనంతరం తుది కీని విడుదల చేయనుంది. గ్రూప్-4 పరీక్ష రాసిన మొత్తం 7,62,872 మంది అభ్యర్థుల ఓఎంఆర్ షీట్లను టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు.
ప్రాథమిక, తుది కీ ప్రక్రియ అంతా సెప్టెంబర్ నెలలో పూర్తి చేసి.. అక్టోబర్‌లో ఫలితాలను విడుదల చేయాలని కమిషన్ నిర్ణయించినట్టు సమాచారం. ఇక నవంబర్ నెలలో ఎన్నికల కోడ్ వచ్చే అవకాశం ఉన్నందున అంతకంటే ముందే ఫలితాలను విడుదల చేసి, ఉద్యోగ నియామకాలను భర్తీ చేసేందుకు సన్నాహాలు చేస్తుంది టీఎస్‌పీఎస్సీ.