BRS వరకు ఓకే.. మరి జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే..?
విధాత : తెలంగాణ రాష్ట్ర సమితిని ముఖ్యమంత్రి కేసీఆర్ భారత్ రాష్ట్ర సమితిగా ప్రకటించిన విషయం తెలిసిందే. దేశ ప్రజల ప్రయోజనాల ఎజెండాగానే జాతీయ పార్టీగా భారత్ రాష్ట్ర సమితిని ప్రకటించామని కేసీఆర్ పేర్కొన్నారు. ఈ మేరకు పార్టీ సర్వ సభ్య సమావేశం ఏకగ్రీవ తీర్మానం చేసి ఆమోదించింది. అనంతరం టీఆర్ఎస్ పార్టీని భారత్ రాష్ట్ర సమితిగా మార్చామని కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా సీఎం కేసీఆర్ లేఖ రాశారు. ఆ లేఖను పార్టీ ప్రతినిధులు ఇవాళ […]

విధాత : తెలంగాణ రాష్ట్ర సమితిని ముఖ్యమంత్రి కేసీఆర్ భారత్ రాష్ట్ర సమితిగా ప్రకటించిన విషయం తెలిసిందే. దేశ ప్రజల ప్రయోజనాల ఎజెండాగానే జాతీయ పార్టీగా భారత్ రాష్ట్ర సమితిని ప్రకటించామని కేసీఆర్ పేర్కొన్నారు. ఈ మేరకు పార్టీ సర్వ సభ్య సమావేశం ఏకగ్రీవ తీర్మానం చేసి ఆమోదించింది. అనంతరం టీఆర్ఎస్ పార్టీని భారత్ రాష్ట్ర సమితిగా మార్చామని కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా సీఎం కేసీఆర్ లేఖ రాశారు. ఆ లేఖను పార్టీ ప్రతినిధులు ఇవాళ ఈసీకి అందజేయనున్నారు. మరి బీఆర్ఎస్ జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే ఇవి తప్పనిసరి. ఒక పార్టీకి జాతీయ హోదా కల్పించేందుకు ఎన్నికల సంఘం కొన్ని నిబంధనలు విధించింది. అవేంటో పరిశీలిద్దాం..
-ఒక పార్టీ జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే సార్వత్రిక ఎన్నికల్లో కనీసం 4 లేదా అంత కంటే ఎక్కువ రాష్ట్రాల్లో తమ పార్టీ అభ్యర్థులు పోటీ చేయాలి. అయితే పోటీతోనే సరిపోదు.
-ఆ ఎన్నికల్లో ఆ పార్టీ కనీసం 6 శాతం ఓట్లు సాధించాలి. లేదా
-కనీసం నాలుగు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందాలి. లేదంటే
-సాధారణ ఎన్నికల్లో లోక్‌సభలోని మొత్తం సీట్లలో కనీసం 2 శాతం సీట్లను గెలుచుకొని ఉండాలి. గెలుపొందిన అభ్యర్థులు కనీసం ఏవైనా మూడు రాష్ట్రాల నుంచి ఎన్నికవ్వాలి.
-ఈ నిబంధనల్లో ఏదో ఒక దాన్ని పూర్తి చేయగలిగితేనే జాతీయ పార్టీ అనే గుర్తింపు వస్తుంది.