ఈవీఎంలపై అనుమానం.. ఉరేసుకోబోయిన కాంగ్రెస్ అభ్యర్థి
గుజరాత్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం ఢంకా మోగించింది. కాంగ్రెస్ పార్టీ వెనుకంజలో పడిపోయింది. బీజేపీ ట్రిపుల్ డిజిట్‌లో దూసుకుపోతుండగా, కాంగ్రెస్ కేవలం రెండు డిజిట్లకే పరిమితమైంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తీవ్ర నిరాశకు లోనైంది. ఈవీఎంల ట్యాంపరింగ్‌పై ఆ పార్టీ అభ్యర్థులు ఆరోపణలు చేస్తున్నారు. అయితే గాంధీదాం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భారత్‌భాయి వెల్జిభాయి సోలంకి ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈవీఎంలను […]

గుజరాత్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం ఢంకా మోగించింది. కాంగ్రెస్ పార్టీ వెనుకంజలో పడిపోయింది. బీజేపీ ట్రిపుల్ డిజిట్‌లో దూసుకుపోతుండగా, కాంగ్రెస్ కేవలం రెండు డిజిట్లకే పరిమితమైంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తీవ్ర నిరాశకు లోనైంది. ఈవీఎంల ట్యాంపరింగ్‌పై ఆ పార్టీ అభ్యర్థులు ఆరోపణలు చేస్తున్నారు.
అయితే గాంధీదాం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భారత్‌భాయి వెల్జిభాయి సోలంకి ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారని, తనకు అనుమానాలు ఉన్నాయన్నారు. తన మెడలో ఉన్న పార్టీ కండువాతో ఉరేసుకోబోయారు. అక్కడే ఉన్న ఎన్నికల అధికారులు, పార్టీ కార్యకర్తలు సోలంకి ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. దీంతో కాసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
సోలంకిపై పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి మల్తి కిశోర్ మహేశ్వరి 12 వేల ఓట్ల మెజార్టీతో ముందంజలో ఉన్నారు. కొన్ని ఈవీఎంలను సరిగా సీల్ వేయలేదని, ట్యాంపరింగ్‌కు పాల్పడ్డారని సోలంకి ధర్నాకు దిగారు. ఎన్నికల అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
గుజరాత్ అసెంబ్లీలో మొత్తం 182 స్థానాలు ఉండగా, బీజేపీ ఇప్పటికే 158 స్థానాల్లో గెలుపొందింది. కాంగ్రెస్ 16 స్థానాల్లో విజయం సాధించింది. 27 ఏండ్ల నుంచి గుజరాత్‌లో బీజేపీ అధికారంలో ఉంది.