రాహుల్‌ కోసం యూనివర్సిటీ దాటుకుని వచ్చిన విద్యార్థులు

భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర సందర్భంగా అసోంలో విద్యార్థుల నుంచి రాహుల్‌కు అపూర్వ స్వాగతం లభించింది.

  • By: Somu    latest    Jan 23, 2024 12:08 PM IST
రాహుల్‌ కోసం యూనివర్సిటీ దాటుకుని వచ్చిన విద్యార్థులు
  • బారికేడ్లు దాటాం.. కానీ.. చట్టాన్ని ఉల్లఘించబోం
  • మా పోరాటం అవినీతికర సీఎం పైనే
  • త్వరలో అసోంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం
  • గువాహటిలో కాంగ్రెస్‌ నేత రాహుల్‌


గువాహటి: భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర సందర్భంగా అసోంలో విద్యార్థుల నుంచి రాహుల్‌కు అపూర్వ స్వాగతం లభించింది. ప్రభుత్వం రాహుల్‌ను గువాహటిలోకి అనుమతించకపోయినా.. విద్యార్థులే ఆయన వద్దకు తరలిరావడం విశేషం. వారిని ఉద్దేశించి నగరం వెలుపలే రాహుల్‌ ప్రసంగించారు. తాము బారికేడ్లు మాత్రమే దాటామని, చట్టాన్ని ఉల్లఘించబోమని స్పష్టం చేశారు. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇదే దారిలో ప్రయాణించినా.. ఆ మార్గంలో తమను అనుమతించడం లేదని విమర్శించారు. ‘మనం బలహీనులం కాదు.. మనం అడ్డంకులను బద్దలు కొట్టాం’ అని అన్నారు. కార్యకర్తలు, మద్దతు దారులను బబ్బర్‌ షేర్‌ అంటూ రాహుల్‌ అభివర్ణించారు.