భారత్ జోడో న్యాయ్ యాత్రకు సీఎం రేవంత్‌రెడ్డి

రాహుల్ గాంధీ ఆదివారం నుంచి ప్రారంభించనున్న భారత్ జోడో న్యాయ్ యాత్ర లో పాల్గొనడానికి తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ నుంచి ఇంఫాల్ బయలుదేరారు

భారత్ జోడో న్యాయ్ యాత్రకు సీఎం రేవంత్‌రెడ్డి

విధాత : రాహుల్ గాంధీ ఆదివారం నుంచి ప్రారంభించనున్న భారత్ జోడో న్యాయ్ యాత్ర లో పాల్గొనడానికి తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ నుంచి ఇంఫాల్ బయలుదేరారు. రేవంత్‌రెడ్డి ఇంఫాల్‌లో పార్టీ పలు రాష్ట్రాల కాంగ్రెస్ ప్రతినిధులతో కూడిన ప్రత్యేక బస్సులో జోడో యాత్ర ప్రారంభ ప్రాంతానికి వెళ్లారు. అటు భారత్ జోడో న్యాయ యాత్ర కోసం ఇంఫాల్ విమానాశ్రయానికి చేరుకున్న రాహుల్ గాంధీకి పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్రానికి సంబంధించిన పలు సమస్యలు, నిధుల సాధనకు ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రులను కలిశారు. అలాగే ఏఐసీసీ పెద్దలతో ఖాళీ ఎమ్మెల్సీల భర్తీకి అభ్యర్థుల ఎంపిక, నామినేటెడ్ పోస్టుల భర్తీపై చర్చించారు. ఆదివారం ఇంఫాల్ వెళ్లిన రేవంత్ రెడ్డి తిరిగి ఢిల్లీకి చేరుకుని అటు నుంచి దావోస్ పర్యటనకు వెళ్లనున్నారు.