Tiger | సిద్దిపేట జిల్లాలో పెద్ద పులి కలకలం.. పాదముద్రల సేకరణ
Tiger | సిద్దిపేట జిల్లాలో తొలిసారిగా పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. తొగుట మండల పరిధిలోని పంట పొలాల్లో పెద్ద పులి కనిపించినట్లు స్థానిక రైతు తెలిపాడు.
Tiger | సిద్దిపేట : సిద్దిపేట జిల్లాలో తొలిసారిగా పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. తొగుట మండల పరిధిలోని పంట పొలాల్లో పెద్ద పులి కనిపించినట్లు స్థానిక రైతు తెలిపాడు. దీంతో అటవీ శాఖ అధికారులు అప్రమత్తమై.. పులి సంచరించిన ప్రాంతాలను పరిశీలించారు. సిద్దిపేట రూరల్ మండల పరిధిలోని తొర్నాల, బస్వాపూర్, ఇర్కోడ్, మర్రికుంట గ్రామాల మీదుగా పులి కదలికలు ఉన్నట్లు రైతులు పేర్కొన్నారు. సిద్దిపేట పట్టణానికి సమీప ప్రాంతానికి కూడా పెద్ద పులి వచ్చినట్లు తెలిపారు. అయితే తొగుట మండల పరిధిలో పెద్ద పులి పాదముద్రలను అటవీశాఖ అధికారులు సేకరించారు.
అయితే పులి కామారెడ్డి జిల్లా నుంచి సిద్దిపేట జిల్లాలోకి ప్రవేశించినట్లు అధికారులు నిర్ధారించారు. గత పది రోజుల క్రితం పెద్ద పులి కామారెడ్డి జిల్లాలో సంచరించిందని పేర్కొన్నారు. జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల మీదుగా ప్రవేశించి ఉండొచ్చని తెలిపారు. పులి పాదముద్రల ప్రకారం అది మగ పులి అని నిర్ధారించారు.
తెలంగాణలోకి ప్రవేశించే పులులన్నీ మహారాష్ట్రలోని తడోబా టైగర్ రిజర్వ్ నుంచి వస్తున్నట్లు పేర్కొన్నారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోకి ప్రవేశించి అటు నుంచి మంచిర్యాల, కామారెడ్డి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల మీదుగా సిద్దిపేటకు చేరుకుని ఉంటుందన్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram