Harassment | రొమాంటిక్ ఫొటోలతో ప్రియుడు వేధింపులు.. రూ.9,986 కోట్లు చెల్లించాలన్న అమెరికా కోర్టు
Harassment | ప్రియురాలి రివేంజ్ రొమాంటింక్ ఫొటోలతో వేధింపులు ప్రియుడికి షాకిచ్చిన కోర్టు రూ.986 కోట్లు చెల్లించాలని అమెరికా కోర్టు సంచలన తీర్పు విధాత: ప్రేమికులు ఓసారి బ్రేకప్ చెప్పుకుంటే.. ఆతర్వాత వాళ్లు మాజీలు అయిపోతారు. ఎవరి దారిన వాళ్లు వెళ్లిపోతారు. మళ్ళీ తిరిగి.. ఒకరికి ఒకరు మరొకరు వెళ్లరు. ఒకవేళ మనసు మారితే కరిగిపోవచ్చేమో కానీ.. రివెంజ్ డ్రామా జోలికి అసలు వెళ్ళరు. కర్మకాలి అలాంటి దుశ్చర్యకు పాల్పడితే మాత్రం ఊహించని పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. […]

Harassment |
- ప్రియురాలి రివేంజ్
- రొమాంటింక్ ఫొటోలతో వేధింపులు
- ప్రియుడికి షాకిచ్చిన కోర్టు
- రూ.986 కోట్లు చెల్లించాలని అమెరికా కోర్టు సంచలన తీర్పు
విధాత: ప్రేమికులు ఓసారి బ్రేకప్ చెప్పుకుంటే.. ఆతర్వాత వాళ్లు మాజీలు అయిపోతారు. ఎవరి దారిన వాళ్లు వెళ్లిపోతారు. మళ్ళీ తిరిగి.. ఒకరికి ఒకరు మరొకరు వెళ్లరు. ఒకవేళ మనసు మారితే కరిగిపోవచ్చేమో కానీ.. రివెంజ్ డ్రామా జోలికి అసలు వెళ్ళరు. కర్మకాలి అలాంటి దుశ్చర్యకు పాల్పడితే మాత్రం ఊహించని పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఒక వ్యక్తి కూడా అలాగే చేతులు కాల్చుకున్నాడు.
తన ప్రియురాలికి బ్రేకప్ చెప్పిన తర్వాత.. ప్రియుడు ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. అది కూడా తమ వ్యక్తిగత రొమాంటిక్ ఫొటోలతో ఆమెకు నరకం చూపించాడు. దీంతో ఆమె కోర్టును ఆశ్రయించింది. ప్రియుడికి కోర్టు కోలుకోలేని షాక్ ఇచ్చింది. నువ్వు పెట్టిన టార్చర్ కి నష్టపరిహారం కింద మాజీ భార్యకు రూ.986 కోట్లు చెల్లించాలని కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ ఘటన అమెరికాలో చోటుచేసుకుంది.
సహజీవనం చేసి, విడిపోయారు..
అమెరికాకు చెందిన డీఎల్ అనే మహిళ మార్కెస్ జాక్సన్ అనే వ్యక్తితో 2016 నుంచి కలిసి జీవిస్తోంది. అంతకుముందు కొంతకాలం నుంచి డేటింగ్ చేసిన ఈ జంట, 2016 నుంచి సహజీవనం చేయడం మొదలుపెట్టింది. కొన్ని సంవత్సరాల వరకు వీళ్లు బాగానే కలిసి ఉన్నారు.
కానీ ఇంతలోనే విభేదాలు తలెత్తడంతో తరచూ గొడవలవ్వడం మొదలైంది. ఇలా గొడవలు పడడం కన్నా విడిపోవడం మిన్న అనుకున్నారు. ఇద్దరూ పరస్పర అంగీకారంతో 2021 అక్టోబరులో విడిపోయారు. ఎవరి జీవితాల్లో వాళ్ళు బిజీ అయిపోయారు.
అయితే కొంతకాలం గడిచిన తర్వాత జమాల్ నుంచి డీఎల్ కు వేధింపులు మొదలయ్యాయి. నన్ను విడిచి నువ్వు సుఖంగా ఎలా ఉంటున్నావు.. నేనూ చూస్తానంటూ బెదిరింపులకు దిగాడు. ఆమెతో సన్నిహితంగా ఉన్నప్పుడు తీసుకున్న శృంగార ఫొటోలను ఆన్ లైన్ లో అప్లోడ్ చేశాడు.
అంతేకాదు ఆమె అనుమతి లేకుండా సీసీ కెమెరాలు, మొబైల్ ఫోన్ల ద్వారా తీసిన ఇతర వ్యక్తిగత ఫొటోలని సైతం సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. వాటిని బాధితురాలి స్నేహితుల కుటుంబ సభ్యులకు పంపాడు. ఈ ఫొటో వెంటనే తొలగించడానికి ప్రయత్నిస్తే, అందుకు నీ జీవితం సరిపోదు అంటూ ఆమెకు సందేశాలు పంపేవాడు.
మాజీకి సరైన బుద్ధి చెప్పాలని..
తన పరువు ని ఇలా బజారుకీడ్చటంతో డీఎల్ మనస్తాపం చెందింది. ఆవేదన, కోపంతో రగిలిపోయింది. ఈ క్రమంలో తన మాజీకి సరైన బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంది. తొలుత ఆమె ఈ వ్యవహారంపై పోలీసులను ఆశ్రయించింది.
అయితే వాళ్లు చట్టపరంగా సరైన సహాయం చేయకపోవడంతో, 2022 ఏప్రిల్ లో టెక్సాస్ లోని హరీష్ కౌంటి సివిల్ కోర్టులో దావా వేసింది. అప్పటినుంచి ఈ కేసును విచారిస్తున్న కోర్టు తాజాగా ఇరువర్గాల వాదన అనంతరం సంచలన తీర్పు ఇచ్చింది.
ఒక మహిళను మానసికంగా వేధించినందుకు గాను 2000 మిలియన్ డాలర్లు అంటే రూ.1664 కోట్లు జరిమానా విధించింది. అంతేకాదు ఆమెకు పరువు నష్టం కలిగినందుకుగాను మరో బిలియన్ డాలర్లు అంటే రూ.8322 కోట్లు చెల్లించాలని తీర్పు వెలువరించింది.
దీంతో జమాల్ జాక్సన్ కి దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయింది. కాగా ఓ వ్యక్తి అంగీకారం లేకుండా పర్సనల్ ఫొటోలు నెట్టింట్లో పెట్టి వారి పరువుకు నష్టం కలిగించే చర్యల్ని అమెరికాలో రివేంజ్ పూర్ణగా భావిస్తారు. ఆ కేటగిరి లోనే ఈ కేసు వస్తుంది.