Telangana | తెలంగాణలో భారీ వర్షాలు.. విద్యుత్ శాఖ హెల్ప్ లైన్ నంబర్లు ఇవే..
Telangana | తెలంగాణ వ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా దంచికొడుతన్న వానలకు వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. అక్కడక్కడ భారీ వృక్షాలు నేలకొరగడంతో, విద్యుత్ సరఫరాకు ఆటంకం కలిగింది. ఈ భారీ వర్షాల నేపథ్యంలో టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి.. చీఫ్ జనరల్ మేనేజర్, సూపరింటెండెంట్ ఇంజినీర్లతో ఈ ఉదయం ఆడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. సాధారణ ప్రజలు, విద్యుత్ వినియోగదారులు స్వీయ జాగ్రత్తలు పాటించాలని […]
Telangana |
తెలంగాణ వ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా దంచికొడుతన్న వానలకు వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. అక్కడక్కడ భారీ వృక్షాలు నేలకొరగడంతో, విద్యుత్ సరఫరాకు ఆటంకం కలిగింది. ఈ భారీ వర్షాల నేపథ్యంలో టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి.. చీఫ్ జనరల్ మేనేజర్, సూపరింటెండెంట్ ఇంజినీర్లతో ఈ ఉదయం ఆడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు.
సాధారణ ప్రజలు, విద్యుత్ వినియోగదారులు స్వీయ జాగ్రత్తలు పాటించాలని సీఎండీ కోరారు. వానలు పడే సమయంలో స్టే వైర్, విద్యుత్ లైన్ల కింద, ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద నిలబడకుండా వీలైనంత వరకు వాటికి దూరంగా ఉండాలని సూచించారు.
విద్యుత్ తీగలు నీటిలో పడి ఉంటే గమనించి విద్యుత్ అధికారులకు సమాచారం అందించాలి. ఆ తీగల మీద నుంచి వాహనాలు నడపొద్దని సూచించారు. భారీ వృక్షాలు నేలకొరగడం, చెట్ల కొమ్మలు విరగడం, భవనాలపై విద్యుత్ తీగలు తెగిపడితే వెంటనే హెల్ప లైన్ నంబర్లకు కాల్ చేసి సమాచారం అందించాలన్నారు.
భారీ గాలులు, వర్షం పడేటప్పుడు విద్యుత్ సరఫరాలో హెచ్చు తగ్గులు ఉన్నట్లయితే విద్యుత్ పరికరాలను ఆఫ్ చేసి వెంటనే కంట్రోల్ రూమ్‌కు తెలియజేయాలన్నారు.
విద్యుత్ సమస్యలు ఉంటే.. అత్యవసర పరిస్థితుల్లో 1912, 100 స్థానిక ఫ్యూజ్ ఆఫ్ కాల్ ఆఫీస్ తో పాటు విద్యుత్ శాఖ ప్రత్యేక కంట్రోల్ రూమ్ నంబర్లు 73820 72104, 73280 72106, 73280 71574 నంబర్లకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు. దీంతో పాటు సంస్థ మొబైల్ యాప్, వెబ్‌సైట్, సోషల్ మీడియా ద్వారా కూడా విద్యుత్ సంబంధిత సమస్యలను తమ దృష్టికి తీసుకురావొచ్చని సీఎండీ సూచించారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram