Bengaluru | ఒంటిపై ఉన్న చీర విప్పి.. ఐదుగురి ప్రాణాలను కాపాడిన మహిళ
Bengaluru | ప్రస్తుత సమాజంలో మనషులు చాలా కమర్షియల్ అయిపోయారు. కళ్లెదుటే ఏదైనా ప్రమాదం జరిగితే చూసీచూడనట్టు వెళ్లిపోతుంటారు. కనీసం సహాయం చేసేందుకు కూడా ముందుకు రారు. కానీ ఓ మహిళ మాత్రం ఓ ఆరుగురి ప్రాణాలను కాపాడేందుకు పెద్ద సాహసమే చేసింది. తన చీరను తాడు రూపంలో వారికి అందించి ఆరుగురిలో ఐదుగురి ప్రాణాలను కాపాడింది. ఐదుగురి ప్రాణాలు కాపాడిన ఆ మహిళపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ఆదివారం రోజు బెంగళూరు […]

Bengaluru | ప్రస్తుత సమాజంలో మనషులు చాలా కమర్షియల్ అయిపోయారు. కళ్లెదుటే ఏదైనా ప్రమాదం జరిగితే చూసీచూడనట్టు వెళ్లిపోతుంటారు. కనీసం సహాయం చేసేందుకు కూడా ముందుకు రారు. కానీ ఓ మహిళ మాత్రం ఓ ఆరుగురి ప్రాణాలను కాపాడేందుకు పెద్ద సాహసమే చేసింది. తన చీరను తాడు రూపంలో వారికి అందించి ఆరుగురిలో ఐదుగురి ప్రాణాలను కాపాడింది. ఐదుగురి ప్రాణాలు కాపాడిన ఆ మహిళపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. ఆదివారం రోజు బెంగళూరు నగర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. కేఆర్ జంక్షన్ సమీపంలోని అండర్ పాస్‌లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. అయితే ఆ వరద నీటిలో ఓ ఆరుగురు వ్యక్తులు చిక్కుకున్నారు.
ఓ మీడియా ప్రతినిధి వరద నీటిలో మునిగి కారులో చిక్కుకున్న వారిని కాపాడేందుకు యత్నిస్తుండగా అటుగా వెళ్తున్న ఓ మహిళ వారిని గమనించింది. క్షణం కూడా ఆలోచించకుండా తన ఒంటిపై ఉన్న చీరను వారికి తాడు రూపంలో అందించింది.
అందరూ చూస్తుండగానే తన చీరను విప్పిన ఆమె.. ఆ తర్వాత మీడియా ప్రతినిధికి అందించింది. అండర్ పాస్‌కు ఉన్న ఇనుప చువ్వలకు చీరను కట్టి దాని సాయంతో వరద నీటి నుంచి ఒక్కొక్కరు బయటకు రాగలిగారు. ఇదే వరదలో ఏపీకి చెందిన భానురేఖ అనే టెకీ మృతి చెందారు.
చీర అందించిన మహిళ తెగువను చూసి అక్కడున్న వారంతా ఆమెను అభినందించారు. ఓ మహిళ తన వద్ద చున్నీని ఇవ్వగా, మరో వ్యక్తి తన చొక్కాను విప్పి ఇచ్చాడు. చున్నీ, చొక్కాతో తన శరీరాన్ని కవర్ చేసుకుని ఆ మహిళ అక్కడ్నుంచి వెళ్లిపోయింది. తన చీరతో ఐదుగురి ప్రాణాలను కాపాడిన ఆ మహిళపై ప్రశంసల జల్లు కురుస్తోంది.