27వ వారంలోనూ అబార్షన్‌కు అనుమతి

వివాహానంతరం వచ్చే గర్భాన్ని మహిళ 27వ వారంలోనూ అబార్షన్‌ చేయించుకునేందుకు అనుమతిస్తూ ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది

  • By: Somu    latest    Jan 05, 2024 10:40 AM IST
27వ వారంలోనూ అబార్షన్‌కు అనుమతి
  • ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు



న్యూఢిల్లీ: వివాహానంతరం వచ్చే గర్భాన్ని మహిళ 27వ వారంలోనూ అబార్షన్‌ చేయించుకునేందుకు అనుమతిస్తూ ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఇటీవల ఓ మహిళ తనకు గర్భం వద్దని కోర్టును సంప్రదించి పిటిషన్‌ వేసింది. దీనిపై ఢిల్లీ కోర్టు విచారణ చేపట్టింది. భర్త మరణించిన తర్వాత తనకు తీవ్ర మానసిక సమస్యలు మొదలయ్యాయని మహిళ తెలిపింది. ఈ విషయాలను పరిగణనలోకి తీసుకున్న కోర్టు.. తాజాగా ఆమె 27వారాల గర్భవిచ్ఛిత్తికి అనుమతిస్తున్నట్టు జస్టిస్‌ సుబ్రహ్మణ్యం ప్రసాద్‌ తీర్పు వెల్లడించారు.


27 వారాలు దాటినప్పటికీ ఆ మహిళకు అబార్షన్‌ చేయాలని కోర్టు ఎయిమ్స్‌ ఆస్పత్రిని కోరింది. భర్తను కోల్పోయిన ఆమె తీవ్రమైన మానసిక సమస్యతో బాధపడుతోంది. ఆమె మానసిక పరిస్థితి సరిగా లేనందున ఆమె గర్భంతో ఉంటే తనకు తాను హాని చేసుకునే అవకాశముందని పలు నివేదికలు సూచించినందున కోర్టు.. ఈ కీలక నిర్ణయాన్ని వెలువరించింది. ఇలాంటి ఘటనే గతంలో ముంబయిలో జరిగింది. గుండె సంబంధిత సమస్యతో బాధపడిన ఓ మహిళ 27 వారాల గర్భవిచ్ఛిత్తికి బాంబే హైకోర్టు గతంలో అనుమతించింది. కోర్టు ఆదేశాలతో ముంబయిలోని పరేల్‌ కేఈఎం ఆస్పత్రి వైద్యులు ఆగస్టు 8న అత్యవసర అబార్షన్‌ నిర్వహించగా.. శిశువు సజీవంగా జన్మించింది.