High Court | టాయిలెట్ల నిర్మాణంపై వివ‌రాలివ్వండి? రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన‌ హైకోర్టు

High Court మూడు వారాలు గుడువు కోరిన ప్ర‌భుత్వం త‌దుప‌రి విచార‌ణ ఆగ‌స్టు 3కు వాయిదా హైద‌రాబాద్‌, విధాత: హైదరాబాద్‌ సరూర్‌నగర్‌ కాలేజీలో టాయిలెట్ల నిర్మాణంపై మూడు వారాల్లో వివరాలు అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. మూడు వారాలు గడువుకావాలని, నిర్మాణం ఎప్పుడు పూర్తవుతుందో తెలియజేస్తామని ప్రభుత్వం తరఫు కౌన్సిల్‌ కోరడంతో.. ధర్మాసనం అనుమతించింది. తదుపరి విచారణను ఆగస్టు 3కు వాయిదా వేసింది. సరూర్‌నగర్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలతో వసతుల లేమిపై ఓ పత్రికలో వచ్చిన […]

High Court | టాయిలెట్ల నిర్మాణంపై వివ‌రాలివ్వండి? రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన‌ హైకోర్టు

High Court

  • మూడు వారాలు గుడువు కోరిన ప్ర‌భుత్వం
  • త‌దుప‌రి విచార‌ణ ఆగ‌స్టు 3కు వాయిదా

హైద‌రాబాద్‌, విధాత: హైదరాబాద్‌ సరూర్‌నగర్‌ కాలేజీలో టాయిలెట్ల నిర్మాణంపై మూడు వారాల్లో వివరాలు అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. మూడు వారాలు గడువుకావాలని, నిర్మాణం ఎప్పుడు పూర్తవుతుందో తెలియజేస్తామని ప్రభుత్వం తరఫు కౌన్సిల్‌ కోరడంతో.. ధర్మాసనం అనుమతించింది. తదుపరి విచారణను ఆగస్టు 3కు వాయిదా వేసింది.

సరూర్‌నగర్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలతో వసతుల లేమిపై ఓ పత్రికలో వచ్చిన వార్త ఆధారంగా కొత్తగూడెం భద్రాద్రి జిల్లాకు చెందిన ఎల్‌ఎల్‌బీ విద్యార్థి నల్లపు మణిదీప్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ‘సరూర్‌నగర్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో 700 మంది బాలికల కోసం ఒకే ఒక్క టాయిలెట్‌ ఉండటం అమానవీయం. క్యాంపస్‌లో ఇతర మౌలిక సదుపాయాలు చాలా అధ్వాన్నంగా ఉన్నాయని విద్యార్థులు పలుమార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదు.

రోజులో వారికి అరగంట మాత్రమే విరామం ఉంటుంది. ఈ సమయంలోనే మధ్యాహ్న భోజనంతో పాటు అవసరం ఉన్న వారు టాయిలెట్‌ను వినియోగించుకోగలగాలి. ఇది సాధ్యమయ్యేదేనా? తాగు నీరు కూడా అందుబాటులో లేదు. కుళాయిల్లో నీళ్లు రాక విద్యార్థినులు రుతుక్రమం సమయంలో కాలేజీకి వెళ్లడమే మానేశారు. కొందరైతే రుతుక్రమాలను ఆపడానికి టాబ్లెట్లను ఉపయోగిస్తున్నారు.

ఒక్కోసారి విధిలేక మూత్ర విసర్జన కోసం బయటకు వెళ్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మానవ హక్కుల కమిషన్‌కు కూడా దీనిపై లేఖ ద్వారా ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. అయితే ఆ కమిషన్‌ చైర్‌పర్సన్‌, సభ్యుల పోస్టులు ఖాలీగానే ఉన్నాయి. దీంతో ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సి వచ్చింది.

వెంటనే టాయిలెట్లతో పాటు ఇతర మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలి’అని గత ఫిబ్రవరిలో పిటిషన్‌ వేశారు. ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అలోక్‌ అరాధే, జస్టిస్‌ వినోద్‌కుమార్‌ ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ చేపట్టి.. ప్రభుత్వానికి 3 వారాలు గడువు ఇచ్చింది.