High Court | HRC చైర్మన్, సభ్యులను ఎప్పుడు నియమిస్తారు?: తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్
High Court నియామకంపై మరి కొన్ని రోజులు గడువు కోరిన రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఎన్ని రోజులు కావాలని ప్రభుత్వంపై మండి పడిన తెలంగాణ హైకోర్టు తదుపరి విచారణను జులై 21కి వాయిదా వేసిన ధర్మాసనం హైదరాబాద్, విధాత : హెచ్ఆర్‌సీ చైర్మన్, సభ్యులను ఇంకా ఎప్పుడు నియమిస్తారని రాష్ట్ర ప్రభుత్వంపై తెలంగాణ హైకోర్టు సీరియస్ అయ్యింది. హెచ్ ఆర్‌సీ చైర్మన్, సభ్యులను నియమించాలని ఇటీవల పిల్ ధాఖలైన విషయం తెలిసిందే. దీనిపై మంగళవారం హైకోర్టు చీఫ్ […]

High Court
- నియామకంపై మరి కొన్ని రోజులు గడువు కోరిన రాష్ట్ర ప్రభుత్వం
- ఇంకా ఎన్ని రోజులు కావాలని ప్రభుత్వంపై మండి పడిన తెలంగాణ హైకోర్టు
- తదుపరి విచారణను జులై 21కి వాయిదా వేసిన ధర్మాసనం
హైదరాబాద్, విధాత : హెచ్ఆర్‌సీ చైర్మన్, సభ్యులను ఇంకా ఎప్పుడు నియమిస్తారని రాష్ట్ర ప్రభుత్వంపై తెలంగాణ హైకోర్టు సీరియస్ అయ్యింది. హెచ్ ఆర్‌సీ చైర్మన్, సభ్యులను నియమించాలని ఇటీవల పిల్ ధాఖలైన విషయం తెలిసిందే. దీనిపై మంగళవారం హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ తుకారాంజీలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.
హెచ్ ఆర్‌సీ చైర్మన్, సభ్యులను నియమించకుండా ఎందుకు సమయం వృథా చేస్తున్నారని ప్రభుత్వం తరుపు న్యాయవాదిని ప్రశ్నించింది. ఇందుకు కారణాలు తెలియజేయాలని చీఫ్ సెక్రటరీకి ఆదేశాలు జారీ చేసింది. దీంతో ప్రభుత్వం తరపు న్యాయవ్యాది జోక్యం చేసుకొని మరి కొద్ది రోజులు సమయం కావాలని, ఆ గడువులోగా పూర్తి వివరాలు కోర్టు ముందు ఉంచుతామని తెలిపారు.
దీంతో జులై 21కి తదుపరి విచారణను వాయిదా వేస్తన్నట్లు ధర్మాసనం తెలిపింది. ఆ లోపు పూర్తి వివరాలు కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది.