Harish Rao : జీవోలపై గోప్యత పై హైకోర్టు తీర్పు చెంపపెట్టు
రాష్ట్ర ప్రభుత్వం దాచిపెట్టిన 15,774 ‘చీకటి జీవోలను’ వెంటనే బహిర్గతం చేయాలని హైకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టు అని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు.
విధాత, హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం దాచి పెట్టిన అన్ని జీవోలను నాలుగు వారాలలోపు బహిర్గతం చేయాలని, పబ్లిక్ డొమైన్‌లో ఉంచాలని హైకోర్టు ఇచ్చిన తీర్పు సోకాల్డ్ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వానికి చెంపపెట్టు వంటిదని బీఆర్ఎస్ మాజీ మంత్రి టి.హరీష్ రావు అన్నారు. ప్రజా ప్రభుత్వం అని చెప్పుకోవడం కాదు..చీకటి జీవోల మాటున నువ్వు దొంగచాటుగా ఏం చేస్తున్నావో బహిర్గతం చెయ్యి అని సీఎం రేవంత్ రెడ్డిని ఎక్స్ వేదికగా హరీష్ రావు డిమాండ్ చేశారు.
ప్రజాపాలన అని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. జీవోలు దాచుతూ చేస్తున్న డ్రామా..RTI సమాధానం ఆధారంగా మా పార్టీ సీనియర్ నాయకులు ఎర్రోళ్ల శ్రీనివాస్ హైకోర్టులో వేసిన పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ (PIL) తో బట్టబయలు కాబోతున్నదని హరీష్ రావు పేర్కొన్నారు. 07-12-2023 నుంచి 26-01-2025 వరకు అంటే మొత్తం 13 నెలల్లో 19,064 జీవోలు జారీ చేయగా, వాటిలో కేవలం 3,290 జీవోలు మాత్రమే పబ్లిక్ డొమైన్‌లో ఉంచడంలో అంతర్యం ఏమిటి? అని నిలదీశారు. ఒక్క ఏడాదిలో 15,774 జీవోలు అంటే 82 శాతం జీవోలను దాచి పెట్టి ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు? అని ప్రశ్నించారు. ఇదేనా మీరు చెప్పిన ప్రజా ప్రభుత్వం? అని సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు మండిపడ్డారు.

ఇవి కూడా చదవండి :
100 Weekend Wonders Contest : బంపర్ ఆఫర్..పర్యాటక ప్రాంతాలు పంపితే నగదు బహమతులు
Ramachandra Reddy : శభాష్ సర్పంచ్ సాబ్…ప్రమాణస్వీకారం రోజే ఇచ్చిన హామీ అమలు
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram