Ramachandra Reddy : శభాష్ సర్పంచ్ సాబ్…ప్రమాణస్వీకారం రోజే ఇచ్చిన హామీ అమలు
సూర్యాపేట జిల్లా నాగారం సర్పంచ్‌గా బాధ్యతలు చేపట్టిన రోజే 95 ఏళ్ల రామచంద్రారెడ్డి తన భార్య పేరిట సొంత ఖర్చుతో దళితవాడలో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి హామీని నిలబెట్టుకున్నారు.
విధాత: కొత్తగా ఎన్నికైన సర్పంచ్ లు పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే ఇచ్చిన హామీల అమలుకు ఉత్సాహంగా ముందడుగు వేస్తున్నారు. తాజాగా సూర్యాపేట జిల్లా నాగారం సర్పంచ్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించిన రోజే.. గుంటకండ్ల రామచంద్రారెడ్డి హామీల అమలుకు ఉపక్రమించిన తీరు సర్వత్రా ప్రశంసలు అందుకుంటుంది.
‘నాగారం బాపు’గా అంతా పిలిచే ఆయన.. గ్రామంలోని దళతవాడలో సొంత ఖర్చుతో తన భార్య సావిత్రమ్మ పేరున వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. సర్పంచ్ గా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే నూతన వాటర్ ప్లాంట్ ప్రారంభించారు. దళితవాడ దాహర్తిని తీర్చినందుకు.. స్థానికులు ఆ పెద్దాయనను శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. 95ఏళ్ల నాగారం సర్పంచ్ గుంటకండ్ల రామచంద్రారెడ్డి బీఆర్ఎస్ మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి తండ్రి కావడం గమనార్హం. రాష్ట్రంలోనే సర్పంచ్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న అతిపెద్ద వయస్కుడిగా రామచంద్రారెడ్డి రికార్డు సాధించడం విశేషం.
ప్రమాణస్వీకారం చేసి హామీల అమలు మొదలు పెట్టిన మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తండ్రి నాగారం సర్పంచ్ గుంటకండ్ల రామచంద్రా రెడ్డి.
గ్రామంలోని దళిత వాడకు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన వాటర్ ప్లాంట్ ఏర్పాటు హామీని అమలు చేసిన రామచంద్రా రెడ్డి.
తన సతీమణి గుంటకండ్ల సావిత్రమ్మ… pic.twitter.com/JK4ikJc3bj
— Telangana First (@TelanganaFirst_) December 22, 2025
ఇవి కూడా చదవండి :
Amaravti : అమరావతి ఆంధ్రుల రాజధాని..ఆమోదించిన కేంద్ర ప్రభుత్వం
Medaram : రేపు మేడారంలో దర్శనాలు బంద్
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram