Hindupur బాలయ్య బాబును నిలువరించేనా? విధాత: నందమూరి ఫ్యామిలీకి అడ్డా లాంటి హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గాన్ని గెలవాలని ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా సక్సెస్ కాలేని వైసిపి ఈసారి కొత్త అభ్యర్థిని బరిలోకి దించుతోంది.. పార్టీ పెట్టాక ఇదివరకు పురుష అభ్యర్థులను బరిలోకి దించి భంగపడిన జగన్ ఈసారి మహిళను పోటీకి దించేలా ప్లాన్ చేస్తున్నారు. వాస్తవానికి హిందూపురం ఎన్టీయార్ కుటుంబానికి పెట్టని కోట అని చెప్పవచ్చు. 1985, 1989, 1994లో వరుసగా గెలిచిన ఎన్టీయార్ చనిపోయే నాటికి […]
Hindupur
విధాత: నందమూరి ఫ్యామిలీకి అడ్డా లాంటి హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గాన్ని గెలవాలని ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా సక్సెస్ కాలేని వైసిపి ఈసారి కొత్త అభ్యర్థిని బరిలోకి దించుతోంది.. పార్టీ పెట్టాక ఇదివరకు పురుష అభ్యర్థులను బరిలోకి దించి భంగపడిన జగన్ ఈసారి మహిళను పోటీకి దించేలా ప్లాన్ చేస్తున్నారు.
వాస్తవానికి హిందూపురం ఎన్టీయార్ కుటుంబానికి పెట్టని కోట అని చెప్పవచ్చు. 1985, 1989, 1994లో వరుసగా గెలిచిన ఎన్టీయార్ చనిపోయే నాటికి హిందూపురం ఎమ్మెల్యేగా ఉన్నారు. 1994లో గెలిచాక ముఖ్యమంత్రి అయింది కూడా హిందూపురం ఎమ్మెల్యేగానే. హ్యాట్రిక్ కొట్టిన ఎన్టీయార్ మరణం తరువాత ఉప ఎన్నిక రాగా 1996లో అక్కడి నుంచి హరికృష్ణ ఎమ్మెల్యేగా గెలిచారు.
ఆ తరువాత 2014లో బాలకృష్ణ పోటీ చేయగా నవీన్ నిష్చల్ ను బరిలోకి దించిన వైసిపి ఓటమిపాలైంది. 2019లో మళ్ళీ బాలయ్య మీద ఇక్బాల్ ను పోటీకి దించినా సేమ్ ఫలితం వచ్చింది. దీంతో ఈసారి మళ్ళీ బాలయ్య హ్యాట్రిక్ కొట్టేందుకు రెడీ అవుతుండగా బాలయ్యను అడ్డుకునేందుకు జగన్ ఈసారి గట్టి ప్రయత్నం చేస్తున్నారు.
ఇక ఇక్కడ నవీన్ నిశ్చల్.. ఇక్బాల్ ఇద్దరూ గ్రూపులుగా విడిపోయి కొట్లాడుకుంటుండగా
హిందూపురంలో గతంలో ఇన్చార్జిగా ఉన్న చౌలూరు రామకృష్ణారెడ్డి గత ఏడాది అక్టోబర్ లో హత్యకు గురయ్యారు. ఇప్పుడు ఆయన చెల్లెలు మధుమిత వైసీపీలో యాక్టివ్ గా పని చేసేందుకు, హిందూపురంలో పార్టీ భారం మోసేందుకు సిద్ధం అయ్యారు.
రాయలసీమ రీజనల్ కో ఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆశీస్సులతో ఆమె హిందూపురంలో అడుగు పెట్టాలని అనుకుంటున్నారు. ఈ క్రమంలోనే మొన్న జగన్ సమక్షంలో జరిగిన ఎమ్మెల్యేల సభలో ఆమె పాల్గొన్నారని అంటున్నారు.
గతంలో ఓడిపోయిన ఇక్బాల్ ను జగన్ ఎమ్మెల్సీ పోస్ట్ ఇచ్చి గుర్తించారు. దీంతో దీపికకు ఆయన అనివార్యంగా సపోర్ట్ చేయక తప్పనిసరి అవుతోంది. మరి ఈ మధుమిత సమర్థంగా పని చేస్తారా ? బాలయ్య బాబు మూడోసారి అసెంబ్లీకి వెళ్లకుండా ఆపుతారా ? చూడాలి..