Street Dogs | వీధి కుక్కల వీరంగం… స్కూళ్లకు, అంగన్‌వాడీ సెంటర్లకు సెలవు
Street Dogs | వీధి కుక్కలు వీరంగం సృష్టిస్తూ.. కనిపించిన వారిని కనిపించినట్లే కరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో వీధి కుక్కలను పట్టుకునేందుకు కేరళ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో కోజికోడ్‌లోని ఆరు స్కూళ్లు, 17 అంగన్‌వాడీ సెంటర్లకు కేరళ ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ఇటీవలే ఓ నలుగురిపై వీధి కుక్కలు దాడి చేసి, తీవ్రంగా గాయపరిచాయి. ఇందులో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. అయితే ఆ నలుగురిని కరిచిన కుక్కకు రేబిస్ లక్షణాలు ఉన్నట్లు అధికారులు […]

Street Dogs | వీధి కుక్కలు వీరంగం సృష్టిస్తూ.. కనిపించిన వారిని కనిపించినట్లే కరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో వీధి కుక్కలను పట్టుకునేందుకు కేరళ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో కోజికోడ్‌లోని ఆరు స్కూళ్లు, 17 అంగన్‌వాడీ సెంటర్లకు కేరళ ప్రభుత్వం సెలవులు ప్రకటించింది.
ఇటీవలే ఓ నలుగురిపై వీధి కుక్కలు దాడి చేసి, తీవ్రంగా గాయపరిచాయి. ఇందులో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. అయితే ఆ నలుగురిని కరిచిన కుక్కకు రేబిస్ లక్షణాలు ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఆ కుక్క పిల్లలపై దాడి చేసే ప్రమాదముందని భావించిన అధికారులు.. ముందస్తు జాగ్రత్తగా 6 స్కూళ్లకు, 17 అంగన్‌వాడీ సెంటర్లకు సెలవు ప్రకటించారు. దీంతో పిల్లలు ఇండ్లకే పరిమితమయ్యారు. ఇక ప్రాంతాన్నంతా తమ ఆధీనంలోకి తీసుకున్న అధికారులు.. వీధి కుక్కలను పట్టుకున్నారు. వీధి కుక్కల పట్ల పిల్లలు, పెద్దలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.