Honey Rose: ఏంటి హ‌నీరోజ్ స‌ర్జ‌రీ చేయించుకోబోతుందా.. స్వ‌యంగా చెప్పుకొచ్చిన వీర‌సింహారెడ్డి బ్యూటీ

Honey Rose: హ‌నీరోజ్‌.. ఈ అందాల ముద్దుగుమ్మ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌నక్కర్లేదు. వీర‌సింహారెడ్డి చిత్రంతో ఒక్క‌సారిగా అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. హనీ రోజ్ 2008లో శివాజీ హీరోగా వచ్చిన ఆల‌యం అనే తెలుగు చిత్రంలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా పెద్ద‌గా ఆద‌ర‌ణ ద‌క్కించుకోక‌ పోవ‌డంతో హనీ రోజ్ గురించి తెలుగు ప్రేక్షకులకు తెలియకుండా పోయింది. ఇక 2014లో వరుణ్ సందేశ్‌కి జంటగా ఈ వర్షం సాక్షిగా అనే చిత్రం చేయ‌గా, ఈ మూవీ కూడా […]

  • By: sn    latest    Jul 26, 2023 5:43 AM IST
Honey Rose: ఏంటి హ‌నీరోజ్ స‌ర్జ‌రీ చేయించుకోబోతుందా.. స్వ‌యంగా చెప్పుకొచ్చిన వీర‌సింహారెడ్డి బ్యూటీ

Honey Rose:

హ‌నీరోజ్‌.. ఈ అందాల ముద్దుగుమ్మ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌నక్కర్లేదు. వీర‌సింహారెడ్డి చిత్రంతో ఒక్క‌సారిగా అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. హనీ రోజ్ 2008లో శివాజీ హీరోగా వచ్చిన ఆల‌యం అనే తెలుగు చిత్రంలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా పెద్ద‌గా ఆద‌ర‌ణ ద‌క్కించుకోక‌ పోవ‌డంతో హనీ రోజ్ గురించి తెలుగు ప్రేక్షకులకు తెలియకుండా పోయింది.

ఇక 2014లో వరుణ్ సందేశ్‌కి జంటగా ఈ వర్షం సాక్షిగా అనే చిత్రం చేయ‌గా, ఈ మూవీ కూడా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర తేలిపోయింది. దీంతో హ‌నీరోజ్ అడ్రెస్ లేకుండా పోయింది. అయితే ఎనిమిదేళ్ల తర్వాత వీరసింహా రెడ్డి చిత్రంతో తెలుగు ప్రేక్షకులను ప‌ల‌క‌రించింది ఈ బొద్దుగుమ్మ‌.

వీరసింహారెడ్డి చిత్రంలో హనీ రోజ్ బాలయ్యకు భార్యగా, తల్లిగా నటించి మెప్పించింది. ఈ ఒక్క సినిమాతో హ‌నీ క్రేజ్ తెలుగులో విప‌రీతంగా పెరిగింది. ఈ అమ్మ‌డికి షాప్ ఓపెనింగ్స్ కోసం ప‌లు కంపెనీలు ఆహ్వానం అందిస్తుండ‌డంతో ఈ అమ్మ‌డి క్రేజ్ మ‌రింత‌గా పెరిగింది.

ఓ సారి రెస్టారెంట్ ఓపెనింగ్ కి హైదరాబాద్ వచ్చిన హనీ రోజ్‌ని అభిమానులు పెద్ద ఎత్తున చుట్టు ముట్టారు. దీనిని చూసి హ‌నీరోజ్ క్రేజ్ ఎంత ఉంద‌నేది అంద‌రికి అర్ధ‌మైంది. ఇక‌ సోష‌ల్ మీడియాలో ఈ అమ్మ‌డు అందాల ఆర‌బోత చేస్తూ కుర్ర‌కారుకి కంటిపై కునుకు లేకుండా చేస్తుంది.

ఇక కొద్ది రోజులుగా హ‌నీ రోజ్ అందం కోసం సర్జరీ చేయించుకున్నారని జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ వార్తలపై ఆమె స్పందిస్తూ.. నేను ఎలాంటి సర్జరీలు చేయించుకోలేదు. నాది సహజ అందమే అని చెప్పుకొచ్చింది. గ్లామర్ కోసం కాస్మెటిక్ వాడతాను, ఎలాంటి సర్జరీలను ఆశ్రయించలేదు. నటిగా ఉండటం అంత సులభం కాదని, ఆమె అభిప్రాయ పడ్డారు.

ఇక‌ నేను కేరళ ఫుడ్ బాగా ఇష్టపడతాను. హైదరాబాద్ బిర్యానీ, రైస్ , పెరుగు కూడా నాకు బాగా న‌చ్చుతాయి.. పెళ్లి అనేది ఒక బాధ్యత. అందుకే నేను ప్రతి విషయాన్ని ఎంతో ప్రేమిస్తాను. సోషల్ మీడియాలో మంచి చెడు రెండూ ఉంటాయ‌ని అందాల హనీ రోజ్ చెప్పుకొచ్చింది.