22-02-2023 బుధవారం.. మీ రాశి ఫలాలు.. వీరికి చిరకాల కోరికలు నెరవేరుతాయి..!
మేషం : పొరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశం. కుంటుంబ సభ్యులు అపార్థము చేసుకునే అవకాశము. ధన నష్టములు కలుగవచ్చును. క్రీడాకారులకు శ్రమ ఎక్కువగా ఉండవచ్చును. వృషభం : వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన కార్యం ఆరంభం చేయుదురు. రావలసిన సొమ్ము చేతికి అందుతుంది. దూర ప్రాంతముల నుండి శుభ వార్తలు వింటారు. కోపాన్ని అదుపులో ఉంచుకోండి. మిథునం : ఆలోచనలను అదుపులో ఉంచుకోండి. తొందరపాటు పనికిరాదు. చిరకాల కోరికలు నెరవేరుతాయి. బంధుమిత్రుల సహకారం ఉంటుంది. ఆకస్మిక ధన […]

మేషం : పొరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశం. కుంటుంబ సభ్యులు అపార్థము చేసుకునే అవకాశము. ధన నష్టములు కలుగవచ్చును. క్రీడాకారులకు శ్రమ ఎక్కువగా ఉండవచ్చును.
వృషభం : వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన కార్యం ఆరంభం చేయుదురు. రావలసిన సొమ్ము చేతికి అందుతుంది. దూర ప్రాంతముల నుండి శుభ వార్తలు వింటారు. కోపాన్ని అదుపులో ఉంచుకోండి.
మిథునం : ఆలోచనలను అదుపులో ఉంచుకోండి. తొందరపాటు పనికిరాదు. చిరకాల కోరికలు నెరవేరుతాయి. బంధుమిత్రుల సహకారం ఉంటుంది. ఆకస్మిక ధన లాభము కలుగుతుంది.
కర్కాటకం : సత్ప్రవర్తనను కలిగి ఉంటారు. దైవిక కార్యక్రమాలలో పాల్గొనడం మనశ్శాంతినిస్తుంది. శుభ కార్య నిర్వహణకై సమాలోచనలు చేస్తారు. ధన ప్రాప్తి కలుగుతుంది.
సింహం : మనోధైర్యాన్ని కలిగి వుండండి. భాగస్వాములతో ఓపికగా వ్యవహరించండి. వృధాగా సంచారము చేయవలపి వస్తుంది. భోజనము రుచించదు.
కన్య : అంచనాలకు మించిన ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబసభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు. విందు, వినోదములలో పాల్గొంటారు. క్రీడాకారులు చక్కని ప్రదర్శనలతో గౌరవాన్ని పొందుతారు.
తులా : నూతన వ్యక్తులతో స్నేహములు చేయుదురు. తల్లిదండ్రుల ఆదరణ లభిస్తుంది. కళాకాకులకు గౌరవం లభిస్తుంది. సరియైన సలహాలతో మిత్రులకు సహాయమందిస్తారు. నష్ట ధన ప్రాప్తి కలుగవచ్చును.
వృశ్చికం : ముఖ్యమైన పనులు ముందుకు సాగకపోవడంతో మనోవ్యధ కలుగవచ్చును. ప్రయాణముల మూలకంగా శ్రమ కలుగుతుంది. అకారణ కలహముల లేర్పడతాయి. ధనం చేతిలో నిలవదు.
ధనుస్సు : తీర్థయాత్రలు ఉల్లాసాన్నిస్తాయి. ప్రభుత్వ అనుమతులు లభించడంతో పనులు ఆరంభం చేస్తారు. సత్ప్రవర్తనతో అందరి మన్ననలను పొందుతారు. మొండి బకాయిలు వసూలవడంతో ధనప్రాప్తి కలుగుతుంది.
మకరం : మాట చెల్లుబాటు కావడంతో సమాజంలో గౌరవం లభిస్తుంది. మనోధైర్యంతో పనులను పూర్తిచేస్తారు. ధనాగమము తృప్తికరంగా వుంటుంది. కుటుంబసభ్యుల సహకారం లభిస్తుంది.
కుంభం : గతంలో చేసిన పొరపాట్లకు పశ్చాత్తాప పడవలసి వస్తుంది. మోకాళ్ళ నొప్పులు, నరాల బలహీనత బాధిస్తాయి. వస్తునష్టములు కలుగవచ్చును. స్థిరాస్థి మూలక అశాంతి కలుగవచ్చును.
మీనం : స్థిరాస్థి వ్యవహారాలు లాభిస్తాయి. మంచి వ్యక్తులతో కలయికలు వుంటాయి. సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. వివాహప్రయత్నాలు సానుకూలంగా వుంటాయి.
– తూండ్ల కమలాకర శర్మ సిద్ధాంతి,
కూకట్‌పల్లి, హైదరాబాద్
ఫోన్ నంబర్ : +91 99490 11332