Horoscope | మేషం : ఈ రాశి వారికి పని భారం పెరుగుతుంది. ఒత్తిడిని జయించేలా ముందుకు వెళ్లాలి. కుటుంబ సభ్యులను ఎదురించక పోవడం మంచిది. బంధు, మిత్రుల సహకారం ఉంటుంది. వృషభం : ఈ రాశి వారు భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని ముందడుగు వేయాలి. మనోధైర్యమే కాపాడుతుంది. శుభకార్యాల గురించి మాట్లాడుకుంటారు. మిథునం : ఈ రాశి వారు ఉత్సాహంగా పని చేసి, అనుకున్నది సాధిస్తారు. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. ఆనందాన్ని కలిగించే సంఘటన […]
Horoscope |
మేషం : ఈ రాశి వారికి పని భారం పెరుగుతుంది. ఒత్తిడిని జయించేలా ముందుకు వెళ్లాలి. కుటుంబ సభ్యులను ఎదురించక పోవడం మంచిది. బంధు, మిత్రుల సహకారం ఉంటుంది.
వృషభం : ఈ రాశి వారు భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని ముందడుగు వేయాలి. మనోధైర్యమే కాపాడుతుంది. శుభకార్యాల గురించి మాట్లాడుకుంటారు.
మిథునం : ఈ రాశి వారు ఉత్సాహంగా పని చేసి, అనుకున్నది సాధిస్తారు. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. ఆనందాన్ని కలిగించే సంఘటన ఉంది.
కర్కాటకం : ఈ రాశి వారు కొట్లాటలకు దూరంగా ఉండుట మంచిది. బుద్ధి బలమే పెట్టుబడి. తద్వారా లాభాలను అందుకుంటారు. బంధు, మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు.
సింహం : ఈ రాశి వారు కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తారు. ఆలోచించి ఖర్చు చేస్తే మంచిది. తనలో ఉన్న సంతోషాన్ని తోటి వారితో పంచుకుంటారు.
కన్య : ఈ రాశి వారికి అర్ధ లాభం కలదు. నచ్చినవారితో ఆనందంగా ఉంటారు. శ్రమ పెరగకుండా చూసుకోవాలి.
తుల : ఈ రాశి వారికి ఉద్యోగ పరంగా అనుకూలంగా ఉంది. మితంగా ఖర్చు చేస్తే మంచిది. కుటుంబ సభ్యులతో ప్రేమగా మెలగాలి. ప్రారంభించిన కార్యక్రమాన్ని తప్పకుండా పూర్తి చేస్తారు.
వృశ్చికం : ఈ రాశి వారికి ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. బంధుమిత్రులతో కలిసి కీలక విషయాలు చర్చిస్తారు. అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉంటే మంచిది.
ధనుస్సు : ఈ రాశి వారు తెలివిగా ఆలోచించి కొన్ని కీలకమైన పనులను పూర్తి చేస్తారు. ఏ పని తలపెట్టినా క్షణాల్లో పూర్తవుతుంది. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు.
మకరం : ఈ రాశి వారికి శారీరక శ్రమ పెరుగుతుంది. కుటుంబ సభ్యులకు స్వల్ప అనారోగ్య సమస్యలు ఏర్పడుతాయి. కొన్ని కీలక వ్యవహారాల్లో ఆలస్యం జరుగుతుంది. అధికారులతో అప్రమత్తంగా ఉంటే మంచిది.
కుంభం : ఈ రాశి వారు మనోధైర్యంతో ముందుకు సాగుతారు. కీలక పనులు పూర్తి చేస్తారు. కీలక నిర్ణయాలు కూడా తీసుకుంటారు. ఇతరులను ఇబ్బంది పెట్టకుండా, మీ పని మీరు చేసుకుపోతే ఇబ్బందులు ఉండవు.
మీనం : ఈ రాశి వారికి శుభకాలం ఇది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల వారికి శుభవార్త అందుతుంది. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఒక వార్త మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది.