India @ Oscars । 2023 ఆస్కార్ అవార్డుల్లో భారత్ నుంచి ‘నాటు నాటు’, పాట, ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ చోటు చేసుకున్నాయి. నాటు నాటు పాటకు గాను ఎంఎం కీరవాణి, పాట రచయిత చంద్రబోస్, ది ఎలిఫెంట్ విస్పరర్స్ డాక్యుమెంటరీకి గాను కార్తికి గొంజాల్వెజ్, గునీత్ మోంగా అవార్డులు అందుకున్నారు. మరి గతంలో ఎవరెవరికి అవార్డులు వచ్చాయో చూద్దామా? విధాత: హాలీవుడ్‌లోని డాల్బీ థియేటర్లో 95వ అకాడమీ అవార్డుల (95th Academy Awards) ప్రదానోత్సవం అంగరంగ […]
India @ Oscars । 2023 ఆస్కార్ అవార్డుల్లో భారత్ నుంచి ‘నాటు నాటు’, పాట, ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ చోటు చేసుకున్నాయి. నాటు నాటు పాటకు గాను ఎంఎం కీరవాణి, పాట రచయిత చంద్రబోస్, ది ఎలిఫెంట్ విస్పరర్స్ డాక్యుమెంటరీకి గాను కార్తికి గొంజాల్వెజ్, గునీత్ మోంగా అవార్డులు అందుకున్నారు. మరి గతంలో ఎవరెవరికి అవార్డులు వచ్చాయో చూద్దామా?
విధాత: హాలీవుడ్‌లోని డాల్బీ థియేటర్లో 95వ అకాడమీ అవార్డుల (95th Academy Awards) ప్రదానోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. ఈసారి రెండు విభాగాల్లో అవార్డులు దక్కించుకోవడం ద్వారా భారతీయ సినిమా (Indian Cinema) చరిత్ర సృష్టించింది. తెలుగు దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ (RRR)చిత్రంలోని ‘నాటు నాటు’ పాట ఉత్తమ ఒరిజినల్ సాంగ్ (Best Original Song’) క్యాటగిరీలో అవార్డు దక్కించుకోగా.. దర్శకురాలు కార్తికి గొంజాల్వెజ్ (Kartiki Gonsalves) దర్శకత్వం వహించిన ది ఎలిఫెంట్ విస్పరర్స్ (The Elephant Whisperers) ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలింగా ఎంపికైంది. అయితే.. భారతీయులు ఆస్కార్ అవార్డులు గెలుచుకోవడం ఇదే మొదటిసారి కాదు. వారెవరంటే..
1982లో విడుదలైన గాంధీ (Gandhi) సినిమాకు గాను భాను అతయ్యా (Bhanu Athaiya) ఉత్తమ కాస్ట్యూమ్ డిజినర్గా ఆస్కార్ అవార్డు పొందారు. భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ఒకరు ఆస్కార్ అవార్డు పొందటం అనేది అదే మొదటిసారి. సినిమాకు ఈమె పనిచేశారు. ఈ సినిమాను రిచర్డ్ అటెన్‌బరో (Richard Attenborough) డైరెక్ట్ చేశారు. గుల్జార్ దర్శకత్వం వహించిన లేకిన్, ఆమిర్‌ఖాన్ నటించిన లగాన్ చిత్రాలకు గాను ఆమె జాతీయ అవార్డులు అందుకున్నారు. మొత్తంగా ఆమె 90కి పైగా సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా ఉన్నారు. గురుదత్, యశ్‌చోప్రా, బీఆర్ చోప్రా, రాజ్‌కపూర్ వంటి దిగ్గజాలతో పనిచేశారు.
భారతదేశం గర్వించతగిన దర్శకుల్లో అగ్రగణ్యుడిగా, ప్రపంచ ప్రఖ్యాత దర్శకులలో ఒకరిగా పేర్కొనే సత్యజిత్‌రే (Satyajit Ray) చలన చిత్ర రంగంలో చేసిన సేవలకు గౌరవసూచకంగా ఆస్కార్ అవార్డు పొందారు. 1992 నిర్వహించిన 64వ అకాడమీ వేడుకల్లో సత్యజిత్రేను జీవితకాల సాఫల్య పురస్కారం(Lifetime Achievement) తో గౌరవించారు. అయితే.. అవార్డు తీసుకునే సమయానికి ఆయన తీవ్ర అనారోగ్యంతో ఉండటంతో వేదికపై వ్యక్తిగతంగా హాజరై అవార్డు అందుకోలేక పోయారు. కానీ.. ఆయన సందేశాన్ని డాల్బీ థియేటర్లో ప్రదర్శించారు. సత్యజిత్ రేకు అవార్డును హాలీవుడ్ నటుడు ఆడ్రే హెప్బర్న్ ప్రకటిస్తూ మోషన్ పిక్చర్స్ కళలో ఆయన రే పనితరం అరుదైనదని అభివర్ణించారు. ఆయన మానవతావాదం ప్రభావం ప్రపంచవ్యాప్తంగా దర్శకులపైన, ప్రేక్షకులపైన ఉన్నదని పేర్కొన్నారు. సత్యజిత్ రేకు దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘భారత రత్న’ (Bharat Ratna), దేశంలో సినిమా రంగంలో ఇచ్చే అత్యున్నత అవార్డు ‘దాదాసాహెబ్ ఫాల్కే (Dadasahed Phalke Award)పురస్కారం’ సహా అనేక అవార్డులు దక్కాయి.
2008లో విడుదలైన డానీ బోయల్ దర్శకత్వం వహించిన స్లమ్‌డాగ్ మిలియనీర్ (Slumdog Millionaire) చిత్రానికి గాను ఉత్తమ సౌండ్ మిక్సింగ్ అవార్డును రసూల్ పోకుట్టి (Resul Pookutty) అందుకున్నారు. 2009లో నిర్వహించిన 84వ ఆస్కార్ అవార్డుల ప్రదాన కార్యక్రమంలో పోకుట్టి.. ఇయాన్ టాప్, రిచర్డ్ ప్రైకితో కలిసి ఈ అవార్డుకు ఎంపికయ్యారు. అదే ఏడాది మలయాళం సినిమా ‘కేరళ వర్మ పళస్సి రాజా’ అనే చిత్రానికి జాతీయస్థాయి అవార్డు పొందారు. రా వన్ (2011), హైవే (2004), కొచ్చడియాన్ (2014), పుష్ప ది రైజ్ (2021) చిత్రాలకు ఆయన పనిచేశారు.
రెండు విభాగాల్లో ఏకకాలంలో ఆస్కార్ అవార్డులు పొందిన ఘనత ఏఆర్ రెహమాన్‌ది (AR Rahman). స్లమ్ డాగ్ మిలియనీర్ (Slumdog Millionaire) చిత్రానికి గాను బెస్ట్ ఓరిజినల్ స్కోర్‌తోపాటు జయహో పాటకు గాను బెస్ట్ ఒరిజినల్ సాంగ్ అవార్డును గెలుచుకున్నారు. రెహమాన్‌కు రోజా (1992), మిన్సార కనవు (1996), లగాన్ (2001), కన్నతిల్ ముతమిట్టల్ (20020, కాట్రు వెలియిడాయి (2017), మామ్ (2017) చిత్రాలకు గాను జాతీయ స్థాయిలో పలు అవార్డులు దక్కాయి. ఇవేకాకుండా ప్రఖ్యాత గ్రామీ (Grammy) అవార్డులు, బీఏఎఫ్టీఏ (BAFTA) అవార్డులు, గోల్డెన్ గ్లోబ్ (Golden Globe), ఫిలింఫేర్ అవార్డులు ఎన్నో అందాయి.
గుల్జార్ (Gulzar) భారతీయ ఉర్దూ కవి. పాటల రచయిత, స్క్రీన్‌ప్లే రచయిత, సినీ దర్శకుడు కూడా. స్లమ్ డాగ్ మిలియనీర్ చిత్రానికి గాను రాసిన జయహో (Jai Ho) పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ (Best Original Song) క్యాటగిరీలో రెహమాన్‌తో కలిసి ఆస్కార్ అవార్డు అందుకున్నారు. గుల్జార్‌కు ఆరు జాతీయ అవార్డులు లభించాయి. కేంద్ర ప్రభుత్వం ఆయనను పద్మభూషణ్, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డులతో గౌరవించింది.
https://www.thequint.com/entertainment/cinema/8-indians-who-have-won-oscars-and-their-achievements#read-more