ఏం గుండెలురా బాబు.. పట్టు తప్పితే అంతే సంగతులు!

విధాత: మంచు పర్వతాలైన హిమాలయ శిఖరాల అధిరోహణం ప్రాణంతకమన్నది విదితమే. అయితే తైవాన్ రాజధాని తైపీ నగరం చుట్టు పరుచుకున్న ప్రమాదకర పర్వత శిఖరాలు.. అగ్ని పర్వతాలను అధిరోహించడం కూడా ప్రాణాలతో చెలగాటమే. అందులోనూ క్విక్సింగ్ మౌంటైన్ అధిరోహణం ప్రాణాలు గాల్లో పెట్టినట్లుగా ఉంటుంది.
అయితేనేం అనేక మంది ట్రెక్కింగ్ ప్రియులు అత్యంత ప్రమాదకరమైన క్విక్సింగ్ మౌంటైన్ అధిరోహణకు ఆసక్తి చూపుతునే ఉన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. క్విక్సింగ్ పర్వత శిఖరం 1480 మీటర్ల ఎత్తులో ఉంటుంది. అక్కడికి చేరుకునే క్రమంలో గాల్లో తెలియాడుతూ ఊగిసలాడే 168 మీటర్ల తాళ్ల నిచ్చెన మీదుగా ఎక్కాలి.
చాలా ధైర్యవంతులను కూడా భయపెట్టే ఈ ట్రెక్కింగ్ మధ్యలో భయపడితే గుండె ఆగిపోవాల్సిందే. మధ్యలో పట్టు తప్పినా దేహం భూమికి చేరేలోగానే భయంతో ప్రాణం గాల్లో కలిసిపోయేంత భయంకరంగా నిచ్చెన ప్రయాణం ఉంటుంది. అంతటి ప్రాణాంతక శిఖరారోహణాన్ని ట్రెక్కింగ్ వీరులు ప్రాణాలను లెక్క చేయకుండా అధిరోహిస్తున్న వీడియోలు చూస్తే ఒళ్లు గగుర్పాటుకు గురికావాల్సిందే. గుండె దిటవు చేసుకుని క్విక్సింగ్ పర్వత శిఖరారోహణం వీడియోలపై ఓ లుక్కు వేసుకోండి మరి.
ఏం గుండెలురా బాబు.. పట్టు తప్పితే అంతే సంగతులు! #viral Qixing Mountain’s 1480m cliffs and 168 m ladder pic.twitter.com/zwu0hPtxkt
— srk (@srk9484) April 6, 2025