3D SCREENS | సరికొత్త టెక్నాలజీ.. ఈ వీడియోలు చూస్తే దిమ్మ తిరగాల్సిందే
3D SCREENS, KOREA విధాత: డిజిటల్ అడ్వర్టయిజ్ మెంట్ కొత్త పుంతలు తొక్కుతున్నది. గతంలో సైకిల్ తోక్కుతూ మైక్‌లో మాట్లాడుతూ ప్రచారాలు సాగించగా ఇప్పుడు ఆ స్టేజీలన్నింటినీ దాటుతూ 3D SCREENSలలో ప్రచారానికి వచ్చేశాం. ఇది భవిష్యత్ డిజిటల్ రంగాన్ని కుదిపేస్తుందని చాలామంది చర్చించుకుంటున్నారు. View this post on Instagram A post shared by Nature | Vacation | adventure | Art (@arts.nkl) ప్రస్తుతం కొరియా (KORIEA)లో ఈ […]
3D SCREENS, KOREA
విధాత: డిజిటల్ అడ్వర్టయిజ్ మెంట్ కొత్త పుంతలు తొక్కుతున్నది. గతంలో సైకిల్ తోక్కుతూ మైక్‌లో మాట్లాడుతూ ప్రచారాలు సాగించగా ఇప్పుడు ఆ స్టేజీలన్నింటినీ దాటుతూ 3D SCREENSలలో ప్రచారానికి వచ్చేశాం. ఇది భవిష్యత్ డిజిటల్ రంగాన్ని కుదిపేస్తుందని చాలామంది చర్చించుకుంటున్నారు.
View this post on Instagram
ప్రస్తుతం కొరియా (KORIEA)లో ఈ 3D SCREENS ప్రచారాన్ని అందుబాటులోకి తీసుకురాగా వీటిని చూసిన వారు ఆవాక్కవుతున్నారు. మరి కొంతమంది ఈ యాడ్స్ ఒళ్లు గగుర్పొడిచే విధంగా ఉన్నాయంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇటీవల ఇన్ స్టా గ్రామ్‌లో ఓ ఔత్సాహికుడు ఈ త్రీడి (3D) వీడియోలను యాడ్‌లను షేర్ చేశాడు. ఒక షాపుపై రోబో బయటికి వస్తున్నట్లుగా, మరో దుకాణం వద్ద పిల్లి చిట్టి చేప పిల్లను బయటకు వదలడం పలువురిని నివ్వెరపరుస్తున్నది.
అదేవిధంగా మరో కాంప్లెక్స్ ముందు డ్రాగన్ మెలికలు తిరగడం, పక్కనే ఉన్న మరో దుకాణంపై ఒక వ్యక్తి అటు ఇటు కలియ తిరుగుతూ తన రెండు చేతులను బయటకు పెట్టడం చూసిన వీక్షకులు ఆశ్చర్య పడుతూనే ఇదేం ప్రచారమంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram