Viral Video | పోలీసుల అవినీతిపై మ‌రో పోలీసు న‌డిరోడ్డుపై నిర‌స‌న‌

Viral Video | అవినీతికి పాల్ప‌డ‌కుండా అంద‌రికీ న్యాయం చేసే దిశ‌గా పోలీసులు ముందడుగు వేయాలి. కానీ చాలా మంది పోలీసులు అవినీతికి పాల్ప‌డుతూ.. చాలా కేసుల‌ను నీరుగార్చే ప్ర‌య‌త్నం చేస్తుంటారు. లంచం తీసుకోవడం కూడా పోలీసుల‌కు అల‌వాటే. క‌ష్ట‌ప‌డి దొంగ‌ను ప‌ట్టుకువ‌స్తే.. అత‌నితో డ‌బ్బులు తీసుకోని వ‌దిలి పెట్టారంటూ ఓ పోలీసు నిర‌స‌న వ్య‌క్తం చేశాడు. పోలీసుల అవినీతిపై మ‌రో పోలీసు నిర‌స‌న వ్య‌క్తం చేసిన ఘ‌ట‌న పంజాబ్‌లోని జ‌లంధ‌ర్‌లో వెలుగు చూసింది. వివ‌రాల్లోకి వెళ్తే.. […]

  • Publish Date - July 23, 2023 / 01:33 AM IST

Viral Video | అవినీతికి పాల్ప‌డ‌కుండా అంద‌రికీ న్యాయం చేసే దిశ‌గా పోలీసులు ముందడుగు వేయాలి. కానీ చాలా మంది పోలీసులు అవినీతికి పాల్ప‌డుతూ.. చాలా కేసుల‌ను నీరుగార్చే ప్ర‌య‌త్నం చేస్తుంటారు. లంచం తీసుకోవడం కూడా పోలీసుల‌కు అల‌వాటే. క‌ష్ట‌ప‌డి దొంగ‌ను ప‌ట్టుకువ‌స్తే.. అత‌నితో డ‌బ్బులు తీసుకోని వ‌దిలి పెట్టారంటూ ఓ పోలీసు నిర‌స‌న వ్య‌క్తం చేశాడు. పోలీసుల అవినీతిపై మ‌రో పోలీసు నిర‌స‌న వ్య‌క్తం చేసిన ఘ‌ట‌న పంజాబ్‌లోని జ‌లంధ‌ర్‌లో వెలుగు చూసింది.

వివ‌రాల్లోకి వెళ్తే.. జ‌లంధ‌ర్ ప‌రిధిలోని భోగ్‌పూర్ పోలీసు స్టేష‌న్‌లో ప‌ని చేస్తున్న ఓ కానిస్టేబుల్.. క‌ష్ట‌ప‌డి ఓ దొంగ‌ను స్టేష‌న్‌కు ప‌ట్టుకొచ్చాడు. అయితే ఆ దొంగ‌ను పోలీసులు నిన్న వ‌దిలేశారు. నిన్న స్టేష‌న్‌కు వ‌చ్చిన స‌ద‌రు కానిస్టేబుల్ దొంగ ఎక్క‌డా అని ప్ర‌శ్నించాడు. పోలీసులు సరైన స‌మాధానం చెప్ప‌క‌పోవ‌డంతో ఆ కానిస్టేబుల్ నిర‌స‌న‌కు దిగాడు.

జ‌లంధ‌ర్‌లోని ప‌ఠాన్‌కోట్ హైవేకు అడ్డంగా ఓ తాడును క‌ట్టాడు. ఆ త‌ర్వాత వాహ‌నాల‌కు అడ్డంగా న‌డిరోడ్డుపై ప‌డుకుని.. పోలీసుల అవినీతి బాగోతాన్ని బ‌ట్ట‌బ‌య‌లు చేశాడు. అక్క‌డ‌కు చేరుకున్న ఓ పోలీసు ఆఫీస‌ర్.. స‌ద‌రు కానిస్టేబుల్‌ను అదుపులోకి తీసుకునేందుకు య‌త్నించారు. అత‌న్ని కాలితో కూడా త‌న్నారు. అయిన‌ప్ప‌టికీ కానిస్టేబుల్ త‌న నిర‌స‌న వ్య‌క్తం చేశాడు.

ఈ ఘ‌ట‌నపై భోగ్‌పూర్ స్టేష‌న్ ఇంచార్జి సుఖ్‌జిత్ సింగ్ మాట్లాడుతూ.. స‌ద‌రు కానిస్టేబుల్ ఓ దొంగ‌ను స్టేష‌న్‌కు ప‌ట్టుకొచ్చాడు. స్టేష‌న్ బెయిల్‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోగా, ప‌రిశీలించి విడుద‌ల చేశామ‌న్నారు. కానిస్టేబుల్‌పై ఎలాంటి దాడికి పాల్ప‌డ‌లేద‌ని సుఖ్‌జిత్ సింగ్ తెలిపారు.

Latest News