Himanshu | ఆ స్కూల్‌ను చూసి చ‌లించిపోయా.. కేసీఆర్ మ‌నువ‌డిని క‌దా.. ఎక్స్‌ట్రా ఆర్డిన‌రీగా తీర్చిదిద్దా: క‌ల్వ‌కుంట్ల హిమాన్షు

Himanshu హైద‌రాబాద్ గౌలిదొడ్డిలోని కేశ‌వ న‌గ‌ర్ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌కు తొలిసారి వ‌చ్చిన‌ప్పుడు త‌న క‌ళ్ల‌ల్లో నుంచి నీళ్లు వ‌చ్చాయ‌ని, ఆ బాధ మాటల్లో చెప్పుకోలేనిద‌ని సీఎం కేసీఆర్ మ‌నువ‌డు, కేటీఆర్ త‌న‌యుడు క‌ల్వ‌కుంట్ల హిమాన్షు పేర్కొన్నారు. ఈ పాఠ‌శాలలో గ‌ర్ల్స్‌కు టాయిలెట్స్ కూడా స‌రిగా లేవు.. అలాంటి ప‌రిస్థితుల‌ను తానెప్పుడూ చూడ‌లేద‌న్నారు. ఈ స్కూల్‌ను అద్భుతంగా తీర్చిదిద్దాల‌ని నిర్ణ‌యించుకుని, నిధులు సేక‌రించి, అభివృద్ధి చేశామ‌న్నారు. అంద‌రిలా కాకుండా.. ఎక్స్‌ట్రా ఆర్డిన‌రీగా చేయాల‌నుకున్నాను. ఎందుకంటే కేసీఆర్ మ‌నువ‌డ్ని క‌దా.. […]

Himanshu | ఆ స్కూల్‌ను చూసి చ‌లించిపోయా.. కేసీఆర్ మ‌నువ‌డిని క‌దా.. ఎక్స్‌ట్రా ఆర్డిన‌రీగా తీర్చిదిద్దా: క‌ల్వ‌కుంట్ల హిమాన్షు

Himanshu

హైద‌రాబాద్ గౌలిదొడ్డిలోని కేశ‌వ న‌గ‌ర్ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌కు తొలిసారి వ‌చ్చిన‌ప్పుడు త‌న క‌ళ్ల‌ల్లో నుంచి నీళ్లు వ‌చ్చాయ‌ని, ఆ బాధ మాటల్లో చెప్పుకోలేనిద‌ని సీఎం కేసీఆర్ మ‌నువ‌డు, కేటీఆర్ త‌న‌యుడు క‌ల్వ‌కుంట్ల హిమాన్షు పేర్కొన్నారు. ఈ పాఠ‌శాలలో గ‌ర్ల్స్‌కు టాయిలెట్స్ కూడా స‌రిగా లేవు.. అలాంటి ప‌రిస్థితుల‌ను తానెప్పుడూ చూడ‌లేద‌న్నారు. ఈ స్కూల్‌ను అద్భుతంగా తీర్చిదిద్దాల‌ని నిర్ణ‌యించుకుని, నిధులు సేక‌రించి, అభివృద్ధి చేశామ‌న్నారు. అంద‌రిలా కాకుండా.. ఎక్స్‌ట్రా ఆర్డిన‌రీగా చేయాల‌నుకున్నాను. ఎందుకంటే కేసీఆర్ మ‌నువ‌డ్ని క‌దా.. ఏదైనా నార్మ‌ల్‌గా చేసే అల‌వాటు లేదు అని హిమాన్షు తెలిపారు.

ప‌బ్లిక్‌లో మాట్లాడ‌టం ఇది ఫ‌స్ట్ టైం. కొంచెం న‌ర్వ‌స్‌గా ఉన్న‌ప్ప‌టికీ.. నా ఫ్యామిలీ మెంబ‌ర్స్ ముందు మాట్లాడుతున్న‌ట్లుంది. ఈ రెండేండ్ల కాలంలో 20 నుంచి 30 సార్లు స్కూల్‌ను విజిట్ చేశాను. రాత్రి స‌మ‌యాల్లో వ‌చ్చి కూడా ప‌నుల‌ను ప‌ర్య‌వేక్షించాను. 2022లో క్లాస్ ప్రెసిడెంట్ అయిన‌ప్పుడు ఈ స్కూల్‌ను మా క్లాస్ కో ఆర్డినేట‌ర్ సూచ‌న‌తో విజ‌ట్ చేశాను.

అంద‌రిలా కాకుండా.. ఎక్స్‌ట్రా ఆర్డిన‌రీగా చేయాల‌నుకున్నాను. ఎందుకంటే కేసీఆర్ మ‌నువ‌డ్ని క‌దా.. ఏదైనా నార్మ‌ల్‌గా చేసే అల‌వాటు లేదు. స్కూల్‌కు చుట్టూ గోడ‌లు క‌ట్టి గేట్లు ఏర్పాటు చేయాల‌ని మా క్లాస్ కో ఆర్డినేట‌ర్ సూచించారు. అలా స్కూల్‌ను విజిట్ చేసిన త‌ర్వాత ఇక్క‌డున్న ప‌రిస్థితుల‌ను చూసి చ‌లించిపోయాం. డైనింగ్ హాల్ ఏర్పాటు చేయాల‌నుకున్నాం. క్లాస్ రూమ్స్‌లో తినేస‌రికి ఆ స్మెల్‌కి పురుగులు జ‌మ‌వుతున్నాయి.