Posani Krishna Murali | నేను చనిపోతే.. నా శవాన్ని ఈ సినీ జనాలెవరూ చూడకూడదు: పోసాని కృష్ణ మురళి
Posani Krishna Murali | ముక్కుసూటి తనానికి అతడు కేరాఫ్ అడ్రస్.. ఈ పద్దతి అతనికి మంచి చేసిందో, లేక వివాదాల్లోకి నెట్టిందో ఆయన పేరు చెప్పగానే ఇట్టే తెలిసిపోతుంది. తెలుగు సినీ ఇండస్ట్రీలో రైటర్‌గా, డైలాగ్ రైటర్‌గా, నటుడిగా మంచి పేరున్న పోసాని కృష్ణ మురళి ఉన్నది ఉన్నట్టుగా ముఖం మీద కుండ బద్దలు కొట్టి మరీ మాట్లాడతాడు. ప్రస్తుతం వైసీపీ నేతగా, సీఎం జగన్ పార్టీకి మద్దతుదారుడిగా ఉన్నాడు. ఏదైనా సందర్భంగా మాట్లాడాల్సి వచ్చినా, […]

Posani Krishna Murali |
ముక్కుసూటి తనానికి అతడు కేరాఫ్ అడ్రస్.. ఈ పద్దతి అతనికి మంచి చేసిందో, లేక వివాదాల్లోకి నెట్టిందో ఆయన పేరు చెప్పగానే ఇట్టే తెలిసిపోతుంది. తెలుగు సినీ ఇండస్ట్రీలో రైటర్‌గా, డైలాగ్ రైటర్‌గా, నటుడిగా మంచి పేరున్న పోసాని కృష్ణ మురళి ఉన్నది ఉన్నట్టుగా ముఖం మీద కుండ బద్దలు కొట్టి మరీ మాట్లాడతాడు.
ప్రస్తుతం వైసీపీ నేతగా, సీఎం జగన్ పార్టీకి మద్దతుదారుడిగా ఉన్నాడు. ఏదైనా సందర్భంగా మాట్లాడాల్సి వచ్చినా, చెప్పాలన్నా కూడా పోసాని తనకు తోచిందే చెబుతాడు తప్పితే ఎక్కడా కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే ఉండదు. ఈ ధోరణి చాలామంది శత్రువులనే తెచ్చిపెట్టింది. అలాగే విమర్శలకూ గురవుతూనే ఉంటాడు. అయినా సరే తన ధోరణిలో ఇసుమంత మార్పు రాలేదు. అదే ముక్కుసూటితనం.
తాజాగా పోసాని.. నేను గానీ చనిపోతే నా శవాన్ని ఈ సినీ జనాలు ఎవరూ చూడకూడదు. ఆ సంగతి ఇప్పటికే నా భార్యకు, కుటుంబానికి చెప్పి ఉంచానని సంచలన కామెంట్స్ చేశాడు. నన్ను ఎవరైనా హత్య చేసినా, లేదా నేను చనిపోయినా కూడా చిన్న కన్నీటి బొట్టు కూడా రాల్చవద్దు ఇదే నా భార్యకు చెప్పి ఉంచాను అన్నాడు.
భార్యగా ఆమెకు నాతో గడిపిన ఆనందకరమైన క్షణాలే గుర్తుండాలి.. విషాదంలో ముంచేసేది కాదు నా చావు అనేది నా ఉద్దశ్యం. నేను పోతే ఎలా బ్రతకాలనే ఆలోచన ఆమెకు ఉండకూడదు. చాలా విలువైన ఆస్తుల్ని ఆమె పేర రాశాను. నెలకు రూ.9 లక్షల ఆదాయం వాటి మీద వస్తుంది. పిల్లలు కూడా ఎలా ఉంటారనేది నేను చెప్పలేను. వాళ్ళ మధ్య నా భార్య ఇబ్బంది పడకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పుకొచ్చాడు.
ఇక శవాన్ని ఎందుకు సినీ జనాలు చూడకూడదో కూడా ఆయన క్లారిటీ ఇచ్చాడు. నిజాయితీగా, గొప్ప బ్రతుకు బ్రతికాను. కాబట్టి నా శవాన్ని నా కుటుంబం, నా రక్త సంబంధీకులు మాత్రమే చూడాలి, బయటి వారు చూపించే సానుభూతి నాకు అవసరం లేదని ఖరాకండీగా చెప్పేసాడు పోసాని.
ఈ మాటలు ఇప్పుడు వైరల్ అయ్యాయి. సినీ పరిశ్రమలో బ్రతికి.. మంచి పేరు సంపాదించుకుని ఇంత వ్యతిరేకతను పెంచుకున్నాడేంటని ప్రతి ఒక్కరూ అనుకుంటున్నారు. మరి పోసానికి ఇంత విరక్తి కలిగే విధంగా ఏం జరిగిందో ఆయనకే తెలియాలి.
అయితే సినిమా ఇండస్ట్రీ తరపున నిలబడాల్సిన సమయంలో కూడా.. ఆయన నమ్మిన పొలిటికల్ పార్టీకే సపోర్ట్ ఇవ్వడంతో.. పోసానిపై ఇండస్ట్రీ అంతా గరంగరంగా ఉంది. ప్రస్తుతం ఆయనకి సినిమా అవకాశాలు కూడా పెద్దగా రావడం లేదు. జగన్ ఇచ్చిన పదవి మాత్రం చేతిలో ఉంది. ఆయన సినిమాలు చేయక పోయినా.. ఇబ్బంది పడాల్సిన అవసరం లేనంతగా ఆస్తులను కూడబెట్టినట్లుగా తనే ఓ సందర్భంలోనూ, ఇప్పుడునూ చెప్పుకొచ్చాడు.