Sama’s Sensational Tweet: కేసీఆర్ ఫ్యామిలీలో అల్లుడు ఎపిసోడ్ ముగిసిందా!?
కొత్త మలుపు తిరుగనున్న బీఆర్ఎస్ రాజకీయాలు అంటూ కాంగ్రెస్ మీడియా సెల్ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి ఎక్స్ వేదికగా ఆసక్తకర పోస్టుతో బీఆర్ఎస్ పార్టీ రాజకీయాలపై సెటైర్లు వేశారు. కేసీఆర్ ఫ్యామిలీలో అల్లుడు హరీష్ రావు ఎపిసోడ్ ముగిసిందా?..బీఆర్ఎస్ కుటుంబంలో మరో వికెట్ పడిపోతుందా?..అంటూ కాంగ్రెస్ మీడియా సెల్ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి ఆసక్తి కర ప్రశ్నలు లేవనెత్తడం హాట్ టాపిక్ గా మారింది.

Sama’s Sensational Tweet: కేసీఆర్ ఫ్యామిలీలో అల్లుడు హరీష్ రావు ఎపిసోడ్ ముగిసిందా?..బీఆర్ఎస్ కుటుంబంలో మరో వికెట్ పడిపోతుందా?..అంటూ కాంగ్రెస్ మీడియా సెల్ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి ఆసక్తి కర ప్రశ్నలు లేవనెత్తడం హాట్ టాపిక్ గా మారింది. కొత్త మలుపు తిరుగనున్న బీఆర్ఎస్ రాజకీయాలు అంటూ సామా ఎక్స్ వేదికగా ఆసక్తకర పోస్టుతో బీఆర్ఎస్ పార్టీ రాజకీయాలపై సెటైర్లు వేశారు. నిన్నటి వరకు సంతోష్ రావు ను పక్కనపెట్టిన కేసీఆర్ ఇప్పుడు ఏకంగా అల్లుడు హరీష్ ను పక్కన పెట్టబోతుండా? అని సామా ప్రశ్నించారు. వంద కార్ల కాన్వాయ్ తో వరంగల్ సభా వేదికకి పోయి నేనే అంతా అనే రీతిలో హంగామా చేసిన హరీష్ రావు ఆకస్మాత్తుగా ఎందుకు ఇంటికి పరిమితమయ్యాడని ? ఆయన ప్రశ్నలు సంధించారు. ఎవరైనా హరీష్ రావును అటుదిక్కు పోతే కాళ్లు విరగ్గొడతానని అన్నారా? అని.. బీఆర్ఎస్ లో అంతర్గత కలహాలు రేగాయంటూ చురకలేశారు.
వరంగల్ సభ ఏర్పాట్ల కోసం కేటీఆర్ ను మాత్రమే కేసీఆర్ రోజు ఫామ్ హౌస్ కు పిలుస్తున్నారని..హరీష్ రావు స్థానాన్ని భర్తీ చేసేందుకు తన బిడ్డ కవితని కూడా వారానికి రెండుసార్లు ఫామ్ హౌస్ కి పిలిచి రాజకీయ ఓనమాలు బోధిస్తున్నాడని సామా తన ట్వీట్ లో ప్రస్తావించారు. ఇదంతా రానున్న రోజుల్లో హరీష్ రావు బీజేపీతో టచ్ లో వెళ్తారని కేసీఆర్ కు గట్టి సమాచారం అయితే కాదు కదా? అని సామా సందేహాలు వ్యక్తం చేశారు. లేకపోతే హరీష్ రావు వార్తలు తమ సొంత పత్రిక నమస్తే తెలంగాణలో సైతం ఎందుకు తగ్గిపోయాయి? అని సామా ప్రశ్నించారు. కాంగ్రెస్ నేత సామా ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.