Twitter | మస్క్ కఠిన నిర్ణయం.. ట్విటర్ ఖాతా లేకపోతే ట్వీట్లు చూడలేరు!
Twitter విధాత: ట్విటర్ యూజర్లను పెంచాలని భావిస్తున్న ఆ సంస్థ అధిపతి ఎలాన్ మస్క్ (Elon Musk) మరో కఠిన నిర్ణయం తీసుకున్నారు. ట్విటర్ ఖాతా లేని వారు ఇక నుంచి ట్వీట్లను చూడలేరని, థర్డ్ పార్టీ వెబ్‌సైట్లలోనూ ట్వీట్లు వారికి కనిపించవని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు ట్విటర్‌లో ఖాతా లేని వారు సైతం యాప్‌లో ట్వీట్ చేసేందుకు వీలుండేది. అయితే లైక్, కామెంట్లు చేయడానికి అనుమతి ఉండేది కాదు. అదే విధంగా న్యూస్ వెబ్‌సైట్లలో […]

విధాత: ట్విటర్ యూజర్లను పెంచాలని భావిస్తున్న ఆ సంస్థ అధిపతి ఎలాన్ మస్క్ (Elon Musk) మరో కఠిన నిర్ణయం తీసుకున్నారు. ట్విటర్ ఖాతా లేని వారు ఇక నుంచి ట్వీట్లను చూడలేరని, థర్డ్ పార్టీ వెబ్‌సైట్లలోనూ ట్వీట్లు వారికి కనిపించవని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు ట్విటర్‌లో ఖాతా లేని వారు సైతం యాప్‌లో ట్వీట్ చేసేందుకు వీలుండేది.
అయితే లైక్, కామెంట్లు చేయడానికి అనుమతి ఉండేది కాదు. అదే విధంగా న్యూస్ వెబ్‌సైట్లలో సెలబ్రెటీలు, వైరల్ ట్వీట్లను చూసేందుకు అవకాశం ఉండేది. ఇక నుంచి ఇవేమీ ట్విటర్‌లో ఖాతా లేని వారికి కనిపించవు. ఈ చర్య వల్ల థర్డ్ పార్టీ సైట్‌లు తమ డేటాను ఉపయోగించుకోవడం తగ్గుతుందని మస్క్ భావిస్తున్నారు.
ప్రస్తుత విధానం వల్ల మేము చాలా డేటాను కోల్పోతున్నాము. ఇది సాధారణ యూజర్లను మోసగించడమే. ఇక నుంచి ఇలా జరగదని మస్క్ ట్విటర్‌లో రాసుకొచ్చారు. ఈ నిర్ణయం వల్ల పెద్ద సంఖ్యలో ట్విటర్ ఖాతాలు సృష్టించుకునే అవకాశం ఉంది.
అయితే మస్క్ తీసుకొచ్చిన నిబంధన శాశ్వతంగా ఉంటుందా? లేదా తాత్కాలికమేనా అన్న దానిపై ఎటువంటి స్పష్టతా లేదు. ఇలాంటి కఠిన నిబంధనలు తీసుకోవడం, దానిపై పబ్లిక్ నుంచి తీవ్రమైన విమర్శలు రావడంతో ఆ నిర్ణయాలను వెనక్కి తీసుకోవడం మస్క్‌కు కొత్త కాదని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు.
గతేడాది డిసెంబరులో వేరే సోషల్ మీడియా సైట్ల లింకులు ట్విటర్లో షేర్ అవ్వకుండా బ్లాక్ చేయగా.. దానిపై తీవ్ర విమర్శలు రావడంతో ఆయన వెనక్కి తగ్గారు. మస్క్ ప్రస్తుత నిర్ణయంపైనా అప్పుడే విమర్శలు, నిరసనలు ప్రారంభమయ్యయి. మరోవైపు ఇటీవలే ట్విటర్‌కు కొత్త సీఈవోగా లిండా యకారినోను నియమించిన మస్క్.. ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌గా తానే కొనసాగుతున్నారు.
మైక్రోసాఫ్ట్‌పై విసుర్లు
అనుమతి లేకుండా తమ డేటాను ఉపయోగించుకుంటున్నారంటూ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ (Microsoft)పై ఇటీవలే ట్విటర్ అధిపతి ఎలాన్ మస్క్ విమర్శలు గుప్పించారు. ఇలా దొంగలించిన డేటాను వారి ఆధ్వర్యంలో అభివృద్ధి చేస్తున్న ఓపెన్ ఏఐ (Open AI) మెరుగుదలకు ఉపయోగించుకుంటున్నారని వ్యాఖ్యానించారు.