MP Arvind | ఈవీఎం బటన్ నొక్కితే.. బీజేపీకే ఓటు: ఎంపీ అరవింద్ వివాదాస్పద వ్యాఖ్యలు

MP Arvind | ఈవీఎంలపై ఓటర్లకు అనుమానాలు? బ్యాలెట్ పత్రాల ఓటింగే మేలంటున్న జనం ఇరకాటంలో బీజేపీ అధిష్టానం ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తాం : కవిత విధాతప్రతినిధి, నిజామాబాద్: ఈవీఎం యంత్రాలపై నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ చేసిన సంచలన వ్యాఖ్యలు దుమారానికి దారితీశాయి. ‘బీఆర్ఎస్ గాని, కాంగ్రెస్ పార్టీకి.. ఏ పార్టీ అయినా ఓటర్లు ఓటు వేసే సమయంలో ఈవీఎం యంత్రం బటన్ పై ఎవరికి ఓటు వేసినా, చివరకు "నోటా" […]

  • By: krs    latest    Aug 25, 2023 12:18 AM IST
MP Arvind | ఈవీఎం బటన్ నొక్కితే.. బీజేపీకే ఓటు: ఎంపీ అరవింద్ వివాదాస్పద వ్యాఖ్యలు

MP Arvind |

  • ఈవీఎంలపై ఓటర్లకు అనుమానాలు?
  • బ్యాలెట్ పత్రాల ఓటింగే మేలంటున్న జనం
  • ఇరకాటంలో బీజేపీ అధిష్టానం
  • ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తాం : కవిత

విధాతప్రతినిధి, నిజామాబాద్: ఈవీఎం యంత్రాలపై నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ చేసిన సంచలన వ్యాఖ్యలు దుమారానికి దారితీశాయి. ‘బీఆర్ఎస్ గాని, కాంగ్రెస్ పార్టీకి.. ఏ పార్టీ అయినా ఓటర్లు ఓటు వేసే సమయంలో ఈవీఎం యంత్రం బటన్ పై ఎవరికి ఓటు వేసినా, చివరకు “నోటా” కు బటన్ నొక్కినా అది బీజేపీ కే పడుతుంది. చివరకు తానే గెలుస్తా’ అని ఆయన విలేకరుల సమావేశంలో బహిరంగానే ప్రకటన చేయడం వివాదానికి దారి తీసింది. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల ఓటర్లకు, ప్రజలకు ఈవీఎం యంత్రాల పైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

తండ్రి బాటలోనే తనయుడు..

గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్, నిజామాబాద్ ఎమ్మెల్యే గా ఉన్న ఎంపీ ధర్మపురి అరవింద్ తండ్రి ధర్మపురి శ్రీనివాస్ కూడా నగరంలోని మైనార్టీ ప్రాంతంలో ఇదేవిధంగా ఒక వర్గానికి సంబంధించింది వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో రాజకీయం భవిష్యత్తు తో పాటు ఆ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి కారణమైన విషయం తెలిసిందే.

తాజాగా ఎంపీ ధర్మపురి అరవింద్ కూడా ఈవీఎం యంత్రం తన కీలు బొమ్మలాగనే ఉందని భావిస్తూ ప్రజలను మభ్యపెట్టే విధంగా మాట్లాడడం తన రాజకీయ భవిష్యత్తుకు తలనొప్పిగా మారింది. ధర్మపురి అరవింద్ చేసిన వ్యాఖ్యలపై కేంద్రంలో ఉన్న బీజేపీ అధిష్టానం తీవ్రంగా మండిపడుతున్నట్లు తెలుస్తుంది. కాగా ప్రజలకు అనుమానాలు వ్యక్తమౌడమే కాకుండా వచ్చే ఎన్నికల్లో బ్యాలెట్ పత్రాలను ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఓటర్లు భావిస్తున్నారు.

ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తున్నా.. ఎమ్మెల్సీ కవిత

ఎంపీ వ్యాఖ్యలు తీవ్ర ఆక్షేపనీయం.. నోటాకు ఓటేయాలని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం శోచనీయమని భావిస్తున్నారు. ఇదివరకే ఎంపీ అర్వింద్‌ వ్యాఖ్యలపై భగ్గుమన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి సంచలన కామెంట్స్‌పై మండి పడ్డారు. దీంతో ఎంపీ అరవింద్ డిఫెన్స్‌లో పడ్డాడు. ఈవీఎంల ట్యాంపర్ జరుగుతోందని అశోకా యూనివర్సిటీ ప్రొఫెసర్ నిరూపిస్తే ఆయనను ఆ పోస్టు నుంచి తీసేశారని, దానిపై దేశమంతా చర్చ జరుగుతోందని, అటువంటి సందర్భంలో బీజేపీ ఎంపీ అర్వింద్ ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అనుమానాలను తావిస్తోందని బీఆరెస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు.

రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు పార్టీల ప్రతినిధులు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. ఆమె బుధవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ఈ విషయాన్ని పరిశీలించాలని తాను సీరియస్ గా కేంద్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేస్తున్నానని తెలిపారు. తమ పార్టీ న్యాయ విభాగం తరఫున ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తున్నామన్నారు. ఎంపీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు.

భయాందోళనలు రేపేటట్టుగా ఒక సామాజికవర్గం పేరును తీసుకొని నోటాకు ఓటేయాలని మాట్లాడడం శోచనీయమన్నారు. ఎన్నికల సంఘం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. మొత్తం మీద విలేకరుల సమావేశంలో అరవింద్ చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. ఇటు వివిధ రాజకీయ పార్టీలలో అటు రాజకీయ విశ్లేషకుల్లో జోరుగా చర్చ కొనసాగుతుంది.