Viral Video | జాన‌ప‌ద నృత్యానికి IMF చీఫ్ ఫిదా.. స్టెప్పుల‌తో అద‌ర‌గొట్టేశారు..

Viral Video | ఫోక్ సాంగ్స్ వింటేనే.. మ‌న‌సుకు ఏదో తెలియ‌ని అనుభూతి క‌లుగుతుంది. మ‌న‌కు తెలియ‌కుండానే మ‌నం స్టెప్పులేస్తూ ఎంజాయ్ చేస్తుంటాం. జీ20 స‌మ్మిట్‌లో పాల్గొనేందుకు భార‌త్‌కు వ‌చ్చిన అంత‌ర్జాతీయ ద్ర‌వ్య నిధి(IMF) మేనేజింగ్ డైరెక్ట‌ర్, చైర్మ‌న్ క్రిస్టాలినా జార్జివాకు ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఘ‌న స్వాగ‌తం ల‌భించింది. ఆమెకు జాన‌ప‌ద నృత్యాల‌తో స్వాగ‌తం ప‌లికారు. సాంబ‌ల్‌పురి అనే జాన‌ప‌దానికి అమ్మాయిలు నృత్యం చేయ‌గా, ఆ స్టెప్పుల‌ను చూసి క్రిస్టాలినా ఫిదా అయిపోయారు. ఆమె కూడా ఆ […]

  • By: raj    latest    Sep 09, 2023 1:38 AM IST
Viral Video | జాన‌ప‌ద నృత్యానికి IMF చీఫ్ ఫిదా.. స్టెప్పుల‌తో అద‌ర‌గొట్టేశారు..

Viral Video |

ఫోక్ సాంగ్స్ వింటేనే.. మ‌న‌సుకు ఏదో తెలియ‌ని అనుభూతి క‌లుగుతుంది. మ‌న‌కు తెలియ‌కుండానే మ‌నం స్టెప్పులేస్తూ ఎంజాయ్ చేస్తుంటాం. జీ20 స‌మ్మిట్‌లో పాల్గొనేందుకు భార‌త్‌కు వ‌చ్చిన అంత‌ర్జాతీయ ద్ర‌వ్య నిధి(IMF) మేనేజింగ్ డైరెక్ట‌ర్, చైర్మ‌న్ క్రిస్టాలినా జార్జివాకు ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఘ‌న స్వాగ‌తం ల‌భించింది. ఆమెకు జాన‌ప‌ద నృత్యాల‌తో స్వాగ‌తం ప‌లికారు.

సాంబ‌ల్‌పురి అనే జాన‌ప‌దానికి అమ్మాయిలు నృత్యం చేయ‌గా, ఆ స్టెప్పుల‌ను చూసి క్రిస్టాలినా ఫిదా అయిపోయారు. ఆమె కూడా ఆ అమ్మాయిల మాదిరిగా నృత్యం చేసేందుకు య‌త్నించారు. సాంబ‌ల్‌పురి సాంగ్‌కు క్రిస్టాలినా ఓ రెండు, మూడు స్టెప్పులేసి అంద‌ర్నీ మైమ‌రిపించారు. సాంబ‌ల్‌పురి సాంగ్ ఒడిశాలో ఫేమ‌స్.

ఇక ఐఎంఎఫ్ చీఫ్ నృత్యానికి సంబంధించిన వీడియోను కేంద్ర మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌దాన్ త‌న ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. సాంబ‌ల్‌పురి బీట్స్ ఎవ‌రినైనా ఉత్తేజితుల‌ను చేస్తుంది.. నిరోధించ‌డం క‌ష్ట‌మ‌ని ఆయ‌న పేర్కొన్నారు. క్రిస్టాలినా సాంబ‌ల్‌పురి బీట్స్‌కు స్టెప్పులేయ‌డం ఒడిశాకు గ‌ర్వ‌కార‌ణం అని ఆయ‌న తెలిపారు.