JPS | జేపీఎస్‌ల అంశంలో తెలంగాణ ప్రభుత్వ కీలక నిర్ణయం
విధాత: జేపీఎస్ (JPS)ల అంశంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. సమ్మె విరమించని వారితో ఇక ఎలాంటి సంబంధం ఉండబోదని స్పష్టం చేసింది. విధులకు హాజరైన వారి జాబితాను శనివారం మధ్యాహ్నంలోపు పంపాలని జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. కాగా.. విధులకు హాజరుకాని వారి స్థానాల్లో కొత్త వారిని తాత్కాలిక కార్యదర్శులుగా నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో జేపీఎస్ పరీక్ష రాసిన వారికి మొదటి ప్రాధాన్యం ఇస్తామని పేర్కొన్నది.

విధాత: జేపీఎస్ (JPS)ల అంశంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. సమ్మె విరమించని వారితో ఇక ఎలాంటి సంబంధం ఉండబోదని స్పష్టం చేసింది. విధులకు హాజరైన వారి జాబితాను శనివారం మధ్యాహ్నంలోపు పంపాలని జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
కాగా.. విధులకు హాజరుకాని వారి స్థానాల్లో కొత్త వారిని తాత్కాలిక కార్యదర్శులుగా నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో జేపీఎస్ పరీక్ష రాసిన వారికి మొదటి ప్రాధాన్యం ఇస్తామని పేర్కొన్నది.