Vande Bharat Express | తిరుపతి వెళ్లే వారికి గుడ్‌న్యూస్..! వందే భారత్ ఎక్స్‌ప్రెస్ బోగీల పెంపు..! షెడ్యూల్‌లో స్వల్ప మార్పు..!
Vande Bharat Express | తిరుపతి వెళ్లే వారికి రైల్వేశాఖ శుభవార్తను చెప్పింది. సికింద్రాబాద్ - తిరుపతి మధ్య వందేభారత్ రైలు నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ రైలుకు మంచి డిమాండ్ ఉన్నది. దాంతో ప్రస్తుతం ఎనిమిది కోచ్‌లతో నడుస్తుండగా.. బోగీల సంఖ్యను 16 రైల్వేశాఖ పెంచింది. దాంతో పాటు రైలు షెడ్యూల్‌లో స్వల్పంగా మార్పులు చేసింది. ప్రయాణికుల విజ్ఞప్తి మేరకు 16 కోచ్‌లతో నడవనున్న ఈ రైలు ఈ నెల 17 నుంచి నడవనున్నది. సికింద్రాబాద్- […]

Vande Bharat Express | తిరుపతి వెళ్లే వారికి రైల్వేశాఖ శుభవార్తను చెప్పింది. సికింద్రాబాద్ – తిరుపతి మధ్య వందేభారత్ రైలు నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ రైలుకు మంచి డిమాండ్ ఉన్నది. దాంతో ప్రస్తుతం ఎనిమిది కోచ్‌లతో నడుస్తుండగా.. బోగీల సంఖ్యను 16 రైల్వేశాఖ పెంచింది. దాంతో పాటు రైలు షెడ్యూల్‌లో స్వల్పంగా మార్పులు చేసింది. ప్రయాణికుల విజ్ఞప్తి మేరకు 16 కోచ్‌లతో నడవనున్న ఈ రైలు ఈ నెల 17 నుంచి నడవనున్నది. సికింద్రాబాద్- తిరుపతి- సికింద్రాబాద్ మధ్య మంగళవారం మినహా వారంలో మిగతా రోజుల్లో వందేభారత్ సర్వీసు నడుస్తున్న విషయం విధితమే.
రైలు షెడ్యూల్‌లో స్వల్పంగా మార్పులు చేసినట్లు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రస్తుతం ఉదయం 6 గంటలకు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి వందేభారత్ రైలు తిరుపతికి బయలుదేరుతుండగా.. ఈ నెల 17 నుంచి పావుగంట (15 నిమిషాలు) ఆలస్యంగా బయలుదేరి వెళ్లనున్నారు. నల్గొండకు 7.29 గంటలకు, గుంటూరుకు 9.35, ఒంగోలుకు 11.09, నెల్లూరుకు మధ్యాహ్నం 12.29 చేరుకొని.. అక్కడి నుంచి 2.30 గంటలకు తిరుపతికి చేరుతుంది. తిరుగు ప్రయాణంలో తిరుపతి నుంచి మధ్యాహ్నం 3.15 గంటలకు బయలుదేరి రాత్రి 11.30 గంటలకు సికింద్రాబాద్‌కు చేరుతుంది. సికింద్రాబాద్- తిరుపతి రైలు 131శాతంపైగా ఆక్యుపెన్సీ రేషియో నమోదవుతున్నది. తిరుపతి నుంచి తిరుగు పయనంలో మరింత ఆక్యుపెన్సీ రేషియో నమోదవుతున్నది. ప్రస్తుతం రైలులో 350 సీట్లు ఉండగా.. బోగీల పెంపుతో 1,036కి పెరుగనున్నది.