Vande bharat Express | సికింద్రాబాద్‌ – తిరుపతి వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ షెడ్యూల్‌ను ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే.. రైలు నంబర్‌, ఆగే స్టేషన్లు ఇవే..!

Vande bharat Express | సికింద్రాబాద్‌ - తిరుపతి - సికింద్రాబాద్‌ మధ్య నడిచే వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు పూర్తి షెడ్యూల్‌తో పాటు రైలు వివరాలను దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. సికింద్రాబాద్‌ నుంచి తిరుపతి మధ్య నడిచే ఈ రైలును ఈ నెల 8న ఉదయం 11 గంటలకు ప్రధాని నరేంద్రమోదీ సికింద్రాబాద్‌లో రైల్వేస్టేషన్‌లో ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో రైలు నంబర్లు, సమయాలు, రైలు ఆగే స్టేషన్ల వివరాలను విడుదల చేసింది. సికింద్రాబాద్‌- తిరుపతి (20701) […]

Vande bharat Express | సికింద్రాబాద్‌ – తిరుపతి వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ షెడ్యూల్‌ను ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే.. రైలు నంబర్‌, ఆగే స్టేషన్లు ఇవే..!

Vande bharat Express | సికింద్రాబాద్‌ – తిరుపతి – సికింద్రాబాద్‌ మధ్య నడిచే వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు పూర్తి షెడ్యూల్‌తో పాటు రైలు వివరాలను దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. సికింద్రాబాద్‌ నుంచి తిరుపతి మధ్య నడిచే ఈ రైలును ఈ నెల 8న ఉదయం 11 గంటలకు ప్రధాని నరేంద్రమోదీ సికింద్రాబాద్‌లో రైల్వేస్టేషన్‌లో ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో రైలు నంబర్లు, సమయాలు, రైలు ఆగే స్టేషన్ల వివరాలను విడుదల చేసింది. సికింద్రాబాద్‌- తిరుపతి (20701) రైలు సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో ఉదయం 6 గంటలకు బయలుదేరి 7.19 గంటలకు నల్గొండకు చేరుతుంది.

9.45 గంటలకు గుంటూరు, 11.09 గంటలకు ఒంగోలుకు, 12.29 గంటలకు నెల్లూరుకు చేరుతుంది. మధ్యాహ్నం 2.30 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. తిరుగు సమయంలో తిరుపతి నుంచి సికింద్రాబాద్‌కు (20702) మధ్యాహ్నం 3:15 గంటలకు బయలుదేరుతుది. సాయంత్రం 5.25 గంటలకు నెల్లూరు, 6.30 గంటలకు ఒంగోలుకు, రాత్రి 7.45 గంటలకు గుంటూరు, నల్గొండకు 10.10 గంటలకు చేరుతుంది. అక్కడి నుంచి సికింద్రాబాద్‌కు రాత్రి 11:45 గంటలకు చేరుకోనుంది. ప్రతి మంగళవారం మినహా మిగతా ఆరు రోజుల్లో రైలు నడుస్తుందని దక్షిణ మధ్య రైల్వే వివరించింది.