IND Vs AUS | భారత్‌తో వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన ఆస్ట్రేలియా..  మాక్స్‌వెల్‌, మిచెల్‌ మార్ష్‌ రీ ఎంటీ..!

IND Vs AUS ODI | భారత్‌తో జరిగే మూడు వన్డేల సిరీస్‌కు 16 మంది సభ్యులతో ఆస్ట్రేలియా జట్టును మేనేజ్‌మెంట్‌ ప్రకటించింది. గాయాలతో దూరమైన పలువురు కీలక క్రికెటర్లు మరోసారి పునరాగమనం చేయనున్నారు. కాలిగాయంతో దూరమైన ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ వన్డే జట్టులోకి తిరిగి వచ్చాడు. చీలమండ గాయంతో బాధపడుతూ కోలుకున్న మిచెల్‌ మార్ష్‌ సైతం జట్టులోకి తిరిగివచ్చాడు. వీరిద్దరితో పాటు ఝై రిచర్డ్‌సన్‌ సైతం వన్డే జట్టులో చోటుదక్కింది. వన్డే జట్టు కెపెన్సీ బాధ్యతలను […]

IND Vs AUS | భారత్‌తో వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన ఆస్ట్రేలియా..  మాక్స్‌వెల్‌, మిచెల్‌ మార్ష్‌ రీ ఎంటీ..!

IND Vs AUS ODI | భారత్‌తో జరిగే మూడు వన్డేల సిరీస్‌కు 16 మంది సభ్యులతో ఆస్ట్రేలియా జట్టును మేనేజ్‌మెంట్‌ ప్రకటించింది. గాయాలతో దూరమైన పలువురు కీలక క్రికెటర్లు మరోసారి పునరాగమనం చేయనున్నారు. కాలిగాయంతో దూరమైన ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ వన్డే జట్టులోకి తిరిగి వచ్చాడు. చీలమండ గాయంతో బాధపడుతూ కోలుకున్న మిచెల్‌ మార్ష్‌ సైతం జట్టులోకి తిరిగివచ్చాడు. వీరిద్దరితో పాటు ఝై రిచర్డ్‌సన్‌ సైతం వన్డే జట్టులో చోటుదక్కింది. వన్డే జట్టు కెపెన్సీ బాధ్యతలను ప్యాట్‌ కమిన్స్‌నే అప్పగించింది.

భారత్‌తో సిరీస్‌కు ఆస్ట్రేలియా జట్టు..

పాట్ కమిన్స్ (కెప్టెన్‌), సీన్ అబాట్, అష్టన్ అగర్, అలెక్స్ కారీ, కామెరాన్ గ్రీన్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మార్నస్ లాబుస్చాగ్నే, మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్‌వెల్, ఝే రిచర్డ్‌సన్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినిస్, డేవిడ్ వార్నర్, ఆడమ్‌జంపాను ఎంపిక చేసింది.