Ind vs Pak | ఇండియా- పాక్ మ్యాచ్ జరగడం కష్టమే..నిరుత్సాహంలో ఫ్యాన్స్
Ind vs Pak | దాయాదులతో పోరు అంటే ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు అనే విషయం తెలిసిందే. వరల్డ్ కప్‌కి ముందు టీమిండియా పాకిస్తాన్ జట్టుతో ఆసియా కప్‌లో తలపడనుంది. శనివారం (సెప్టెంబర్ 2)న ఈ మ్యాచ్ జరగనుండగా, ఈ మ్యాచ్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ మ్యాచ్ జరగడం అనుమానంగా మారింది. మ్యాచ్ జరగాల్సిన శ్రీలంకలోని పల్లెకెలెలో రెండు రోజులుగా భారీ వర్షాలు […]

Ind vs Pak |
దాయాదులతో పోరు అంటే ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు అనే విషయం తెలిసిందే. వరల్డ్ కప్‌కి ముందు టీమిండియా పాకిస్తాన్ జట్టుతో ఆసియా కప్‌లో తలపడనుంది. శనివారం (సెప్టెంబర్ 2)న ఈ మ్యాచ్ జరగనుండగా, ఈ మ్యాచ్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ మ్యాచ్ జరగడం అనుమానంగా మారింది.
మ్యాచ్ జరగాల్సిన శ్రీలంకలోని పల్లెకెలెలో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండగా, రేపు కూడా 91 శాతం వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతుంది. దీంతో ఫ్యాన్స్ చాలా నిరుత్సాహంతో ఉన్నారు. అద్భుతం జరిగితే తప్ప ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ జరిగనుందని అంటున్నారు.
ఆగస్ట్, సెప్టెంబర్ నెలల్లో శ్రీలంకలో భారీ వర్షాలు కురుస్తుంటాయి కాబట్టి మ్యాచ్ రోజు కూడా వర్షం తప్పక పడుతుందని చెబుతున్నారు. దీంతో మ్యాచ్ నిర్వాహకులపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈ రెండు నెలల్లో అసలు క్రికెట్ మ్యాచ్ లు అక్కడ పెద్దగా జరగవు.
అలాంటిది ఆసియా కప్ నిర్వహించడం ఏంటని ఫైర్ అవుతున్నారు. గతంలో పల్లెకెలె స్టేడియంలో 33 వన్డేలు జరగగా, మూడు వన్డేలు మాత్రమే ఆగస్ట్, సెప్టెంబర్ నెలలో నిర్వహించారంటే అక్కడి పరిస్థితులు ఎలా ఉంటాయో అర్ధం చేసుకోవచ్చు.
గురువారం (ఆగస్ట్ 31) ఇదే పల్లెకెలె స్టేడియంలో శ్రీలంక, బంగ్లాదేశ్ మ్యాచ్ జరగగా, మ్యాచ్ మాత్రం సజావుగానే సాగింది. పల్లెకెలె స్టేడియంలో జరిగిన గ్రూప్-బీ మ్యాచ్‍లో శ్రీలంక 5 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‍పై ఘన విజయం సాధించింది.
ఈ మ్యాచ్‍లో ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లా 42.4 ఓవర్లలో 164 పరుగులకే ఆలౌట్ కాగా, స్వల్ప లక్ష్యాన్ని 11 ఓవర్లు ఉండగానే చేజ్ చేసి గెలిచింది లంక. ఆదిలో వికెట్లు కోల్పోయినా.. సదీర సమర విక్రమ (54 పరుగులు), చరిత్ అసలంక (62 పరుగులు నాటౌట్) హాఫ్ సెంచరీలు చేసి శ్రీలంకకి మంచి విజయం సాధించారు. ఈ మ్యాచ్ మాదిరిగానే పాక్ ఇండియా మ్యాచ్ కూడా జరగాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు