World Cup | వరల్డ్ కప్ జట్టులో ధోని, యువరాజ్ సింగ్.. ఫ్యాన్స్ ఆలోచనలు మాములుగా లేవుగా..!
World Cup | ఈ ఏడాది అక్టోబర్‌లో ఇండియా వేదికగా వరల్డ్ కప్ టోర్నీ జరగనున్న విషయం తెలిసిందే. వరల్డ్ కప్ టోర్నీ కోసం అన్ని జట్లు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. కప్ గెలవాలనే కసి ప్రతి ఒక్కరిలో ఉంది. అయితే ఇంగ్లండ్ జట్టు 2019 వన్డే వరల్డ్ కప్ గెలుచుకోగా, ఈసారి కూడా కప్ అందుకోవాలని తహతహ లాడుతుంది. ఈ క్రమంలోనే ఇప్పటికే రిటైర్మెంట్ ప్రకటించిన బెన్ స్టోక్స్‌ని తిరిగి జట్టులో చేరాలని కోరినట్టు సమాచారం. […]
World Cup |
ఈ ఏడాది అక్టోబర్‌లో ఇండియా వేదికగా వరల్డ్ కప్ టోర్నీ జరగనున్న విషయం తెలిసిందే. వరల్డ్ కప్ టోర్నీ కోసం అన్ని జట్లు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. కప్ గెలవాలనే కసి ప్రతి ఒక్కరిలో ఉంది. అయితే ఇంగ్లండ్ జట్టు 2019 వన్డే వరల్డ్ కప్ గెలుచుకోగా, ఈసారి కూడా కప్ అందుకోవాలని తహతహ లాడుతుంది. ఈ క్రమంలోనే ఇప్పటికే రిటైర్మెంట్ ప్రకటించిన బెన్ స్టోక్స్‌ని తిరిగి జట్టులో చేరాలని కోరినట్టు సమాచారం.
గత వరల్డ్ కప్ లో కీలక పాత్ర పోషించిన ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్, వన్డే రిటైర్మెంట్‌ని వెనక్కి తీసుకుని.. 2023 వరల్డ్ కప్ ఆడబోతుండగా, ఇండియా జట్టు కూడా రిటైర్ అయిన ధోని, యువరాజ్ సింగ్‌ని ఈ వరల్డ్ కప్ తీసుకుంటే బాగుంటుందని ఫ్యాన్స్ చెబుతున్నారు.
ప్రస్తుతం టీమిండియా జట్టు అంత గొప్పగా కనిపించడం లేదు. స్టార్ ఆటగాళ్లు అందరు గాయాల బారిన పడి జట్టుకి దూరంగా ఉంటున్నారు. కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రిషబ్ పంత్ కొన్నాళ్లుగా క్రికెట్‌కి దూరంగా ఉంటున్నారు. శ్రేయాస్ అయ్యార్, కెఎల్ రాహుల్ పూర్తి ఫిట్‌నెస్ సాధించలేదు.

ఇషాన్ కిషన్, సంజూ శాంసన్ ఫినిషర్ రోల్ పోషించలేక పోతున్న నేపథ్యంలో ధోనీని తిరిగి ఆడిస్తే బాగుంటుందని కొందరి ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. 2019 వన్డే వరల్డ్ కప్ తర్వాత క్రికెట్‌కి దూరంగా ఉన్న మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్‌లో సందడి చేస్తున్నారు. ఈ ఏడాది సీజన్‌లో కొన్ని భారీ షాట్స్ కూడా ఆడాడు. ఆయన ఈ ఒక్క ఏడాది వరల్డ్ కప్ ఆడితే బాగుంటుందని కొందరు కామెంట్ చేస్తున్నారు.
అయితే ఐపీఎల్ 2023 సీజన్ సమయంలో మోకాలి నొప్పితో బాధ పడుతూ చికిత్స చేయించుకున్న ధోనీ తిరిగి జట్టులోకి వచ్చే అవకాశాలు ఏ మాత్రం లేవు. ఇక 2007 టీ20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్ విజయాల్లో కీ రోల్ పోషించిన యువరాజ్ సింగ్ 2017 తర్వాత జట్టులో స్థానం కోల్పోయి 2019లో రిటైర్మెంట్ ఇచ్చారు. అతను రిటైర్మెంట్ వెనక్కి తీసుకుని ఈ ఏడాది వరల్డ్ కప్ ఆడాలని కొందరు ఫ్యాన్స్ కోరుతున్నారు.
అలానే 2007 టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో, 2011 వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌లో అద్భుత ఆటతీరుతో టాప్ స్కోరర్‌గా నిలిచిన గౌతమ్ గంభీర్ 2018లో రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ అతను కూడా తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని ఈ ఏడాది వరల్డ్ కప్ ఆడాలని ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇవి జరగడం అసాధ్యం అయినప్పటికీ ఫ్యాన్స్ మాత్రం తమ కోరికలు మాత్రం వెళ్లబుచ్చుతున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram