Rohit Sharma: వన్డేలో ఏడో స్థానంలో బ్యాటింగ్ చేసిన రోహిత్.. ఆ స్థానంలో వచ్చి వరల్డ్ కప్ గెలిపించిన విషయం తెలుసా?
Rohit Sharma: ప్రస్తుతం టీమిండియా జట్టు భారత పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే.విండీస్ పర్యటనలో భాగంగా రెండు టెస్ట్‌లు ఆడిన భారత జట్టు 1-0తో టెస్ట్ సిరీస్ గెలుచుకుంది. ఇక వన్డే సిరీస్‌ను కూడా విజయంతోనే ఆరంభించింది భారతజట్టు. బార్బడోస్ వేదికగా ముగిసిన తొలి వన్డేలో 115 పరుగుల లక్ష్య ఛేదనను ఐదు వికెట్లు కోల్పోయి చేధించింది టీమిండియా.అయితే ఆ మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు సారథి, ఓపెనర్ రోహిత్ శర్మ ఏకంగా ఏడో స్థానంలో వచ్చి ఇండియాని […]
Rohit Sharma: ప్రస్తుతం టీమిండియా జట్టు భారత పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే.విండీస్ పర్యటనలో భాగంగా రెండు టెస్ట్‌లు ఆడిన భారత జట్టు 1-0తో టెస్ట్ సిరీస్ గెలుచుకుంది. ఇక వన్డే సిరీస్‌ను కూడా విజయంతోనే ఆరంభించింది భారతజట్టు. బార్బడోస్ వేదికగా ముగిసిన తొలి వన్డేలో 115 పరుగుల లక్ష్య ఛేదనను ఐదు వికెట్లు కోల్పోయి చేధించింది టీమిండియా.అయితే ఆ మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు సారథి, ఓపెనర్ రోహిత్ శర్మ ఏకంగా ఏడో స్థానంలో వచ్చి ఇండియాని గెలిపించాడు. అయితే అతను ఆ స్థానంలో బ్యాటింగ్‌కు రావడం అందర్నీ ఆశ్చర్యపరిచింది.

అయితే వెస్టిండీస్ తో జరిగిన తొలి వన్డేలో కెప్టెన్ రోహిత్ శర్మ 12 పరుగులతో అజేయంగా నిలిచాడు. అయితే ఆసక్తికరమైన విషయం ఏంటంటే రోహిత్ శర్మ ఇలా ఏడోస్థానంలో బ్యాటింగ్ కు దిగిన సమయంలో టీమిండియా జట్టు ఇండియా వరల్డ్ కప్ గెలిచింది. 2011 జనవరిలో సౌతాఫ్రికాతో జరిగిన వన్డేలో ఏడో స్థానంలో రోహిత్ బ్యాటింగ్‌కి వచ్చాడు. ఆ సంవత్సరంలో ఏప్రిల్ లో జరిగిన వరల్డ్ కప్ సిరీస్‌లో ఇండియా కప్ గెలిచింది. అయితే ఆ వరల్డ్ కప్ జట్టులో రోహిత్ కు చోటు దక్కలేదు… కానీ ఈ సారి వరల్డ్ కప్‌కి రోహిత్ ఏకంగా కెప్టెన్ గా ఉన్నాడు. మరి గత సెంటిమెంట్ మరో రెండు నెలలో జరగనున్న వరల్డ్ కప్ టోర్నీలో రిపీట్ అవుతుందా లేదా అనేది చూడాలి.
అయితే రోహిత్ శర్మ ఏడో స్థానంలో బ్యాటింగ్‌కి రావడంపై మ్యాచ్ అనంతరం స్పందించారు. భారత జట్టు తరఫున నేను అరంగేట్రం చేసినప్పుడు ఏడో స్థానంలో ఆడాను. వెస్టిండీస్ తో ఆడుతున్నప్పుడు నాకు ఆ రోజులు గుర్తుకు వచ్చాయి. 2011 సంవత్సరం నాకు అసలు కలిసి రాలేదు. అప్పుడు నేను వరల్డ్ కప్ జట్టులో లేకుండా పోయాను. ఆ తప్పు నాదే. ఆ తర్వాత బాగా ఆటపై దృష్టి పెట్టాను. యోగా, మెడిటేషన్, ఒంటరిగా ఉండటం నాకు ఎంతో సాయం చేశాయి. ఆ సమయంలో నేను మారాల్సిన అవసరం ఉందని, ఒకవేళ నేను మెరుగవ్వకపోతే మళ్లీ క్రికెట్ ఆడలేను అన్న విషయం నాకు తెలిసిందని రోహిత్ చెప్పాడు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram