Pakistan: దారుణంగా మారిన పాకిస్తాన్ పరిస్థితి.. ప్రపంచకప్ నుంచి తప్పుకుంటే రూ.285 కోట్ల నష్టమా?

Pakistan: మ‌రి కొద్ది రోజుల‌లో వ‌న్డే ప్ర‌పంచ క‌ప్ మొద‌లు కానుండ‌గా, ఈ టోర్నీ కోసం ప్ర‌పం వ్యాప్తంగా ఉన్న క్రికెట్ ప్రేమికులు అంద‌రు ఎంతో ఆశ‌గా ఎదురు చూస్తున్నారు. అక్టోబ‌ర్-న‌వంబ‌ర్ మ‌ధ్య జ‌రిగే ఈ టోర్నీలో పాకిస్తాన్ జ‌ట్టు ఆడాల్సి ఉండ‌గా, ఆ జ‌ట్టు గంట‌కొకి మాట చెబుతుంది. ముందు భార‌త్ లో ప్ర‌పంచ క‌ప్ ఆడ‌తామని చెప్పిన త‌ర్వాత మాట మార్చారు. ఆసియా కప్‌ కోసం భారత్‌ పాకిస్థాన్‌కు రాకుంటే, ప్రపంచకప్‌ కోసం తమ దేశం […]

  • By: sn    latest    Jul 12, 2023 9:39 AM IST
Pakistan: దారుణంగా మారిన పాకిస్తాన్ పరిస్థితి.. ప్రపంచకప్ నుంచి తప్పుకుంటే రూ.285 కోట్ల నష్టమా?

Pakistan: మ‌రి కొద్ది రోజుల‌లో వ‌న్డే ప్ర‌పంచ క‌ప్ మొద‌లు కానుండ‌గా, ఈ టోర్నీ కోసం ప్ర‌పం వ్యాప్తంగా ఉన్న క్రికెట్ ప్రేమికులు అంద‌రు ఎంతో ఆశ‌గా ఎదురు చూస్తున్నారు. అక్టోబ‌ర్-న‌వంబ‌ర్ మ‌ధ్య జ‌రిగే ఈ టోర్నీలో పాకిస్తాన్ జ‌ట్టు ఆడాల్సి ఉండ‌గా, ఆ జ‌ట్టు గంట‌కొకి మాట చెబుతుంది. ముందు భార‌త్ లో ప్ర‌పంచ క‌ప్ ఆడ‌తామని చెప్పిన త‌ర్వాత మాట మార్చారు. ఆసియా కప్‌ కోసం భారత్‌ పాకిస్థాన్‌కు రాకుంటే, ప్రపంచకప్‌ కోసం తమ దేశం భారత్‌కు రాదని పాకిస్థాన్ క్రీడా మంత్రి అహ్సాన్ మజారీ తాజాగా ఓ ప్రకటన చేశారు. అయితే పాకిస్తాన్ ప్ర‌పంచ క‌ప్ ప‌ర్య‌ట‌న‌కి దూరంగా ఉండే అవ‌కాశం అయితే లేద‌ని విశ్లేష‌కులు అంటున్నారు. వారు దూర‌మైతే 285 కోట్ల రూపాయ‌ల వ‌ర‌కు న‌ష్టం వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు.

2023 ప్రపంచ కప్‌ను పాకిస్తాన్‌ బహిష్కరిస్తే, అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ .. పీసీబీకి నిధులను నిలిపివేసే అవ‌కాశం ఉంది.సాధార‌ణంగ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు సంపాదనలో 50 శాతం ఐసీసీ నుంచి వస్తుంది. రానున్న 4 సంవత్సరాలలో (2024-27), పాకిస్తాన్ క్రికెట్ బోర్డు రూ. 285 కోట్లు పొందాల్సి ఉంది. ఇప్పుడు వారు ప్ర‌పంచ క‌ప్ ఆడ‌క‌పోతే అవి ఆగిపోయే అవ‌కాశం ఉంది. కాగా, ఐసీసీ నాలుగు సంవత్సరాలలో సుమారు $ 600 మిలియన్లు (దాదాపు రూ. 4956 కోట్లు) పంపిణీ చేస్తుండ‌గా, ఇందులో భారతదేశం అత్యధిక వాటాను కలిగి ఉంటుంది. ఐసీసీ ఆదాయంలో భారత్‌కు 38.50 శాతం (సుమారు రూ. 1908 కోట్లు)వ‌చ్చే అవ‌కాశం ఉంది.

2009లో శ్రీలంక జట్టుపై ఉగ్రదాడి జరిగిన తర్వాత పాకిస్తాన్‌లో ఆడాలంటే చాలా జ‌ట్లు భ‌య‌ప‌డ్డాయి ఈ మ‌ధ్య‌నే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, శ్రీలంక, ఇంగ్లండ్ వంటి దేశాలు పాకిస్థాన్‌లో క్రికెట్ ఆడాయి. వాళ్ల ప‌రిస్థితి ప్ర‌స్తుతం కాస్త అయోమ‌యంగానే ఉండ‌గా, వారు క‌నుక‌ వన్డే ప్రపంచకప్‌ను బహిష్కరిస్తే, ఐసీసీ పాకిస్థాన్ జట్టుపై నిషేధం విధించే ఛాన్స్ ఉంది. షెడ్యూల్ ప్ర‌కారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో పాకిస్థాన్ భారత్‌తో మ్యాచ్ ఆడాల్సి ఉంది. కాని ఇక్క‌డ ఆడేందుకు ఆస‌క్తి చూప‌డం లేదు. ఇక పాకిస్తాన్ కూడా ఆఫ్ఘనిస్తాన్‌తో చెన్నైలో, ఆస్ట్రేలియాతో బెంగళూరులో మ్యాచ్‌లు ఆడటానికి ఆస‌క్తి చూప‌డం లేదు. మ‌రి రానున్న రోజుల‌లో పాకిస్తాన్ భ‌విత‌వ్యం ఏంట‌నేది తేల‌నుంది.