India vs England ధ‌ర్మ‌శాల‌ టెస్ట్ ఇద్ద‌రు ఆట‌గాళ్ల‌కు ఎంతో ప్ర‌త్యేకం

ఈనెల 7నుండి ప్రారంభం కానున్న భార‌త్‌-ఇంగ్లండ్ ఐదోది, ఆఖ‌రిదైన టెస్ట్‌మ్యాచ్ ఇద్ద‌రు ఇరుజ‌ట్ల ఆట‌గాళ్ల‌కు ఒక ప్ర‌త్యేక‌మైన గుర్తుగా నిల‌బ‌డిపోనున్న‌ది

India vs England ధ‌ర్మ‌శాల‌ టెస్ట్ ఇద్ద‌రు ఆట‌గాళ్ల‌కు ఎంతో ప్ర‌త్యేకం

నెల 7నుండి ప్రారంభం కానున్న భార‌త్‌-ఇంగ్లండ్ ఐదోది, ఆఖ‌రిదైన టెస్ట్‌మ్యాచ్ ఇద్ద‌రు ఇరుజ‌ట్ల ఆట‌గాళ్ల‌కు ఒక ప్ర‌త్యేక‌మైన గుర్తుగా నిల‌బ‌డిపోనున్న‌ది.

 

స్వ‌దేశంలో ఇంగ్లండ్‌తో జ‌రుగుతున్న టెస్ట్ సిరీస్‌ను అద్భుత‌రీతిలో 3-1తో చేజిక్కించుకున్న భార‌త్‌, ఆఖ‌రిదాన్లోనూ ఆధిప‌త్యం ప్ర‌ద‌ర్శించి ఒడిసిప‌ట్టాల‌ని చూస్తోంది. దీంతో ప్ర‌పంచ టెస్ట్ చాంపియ‌న్‌షిప్‌లో ముంద‌డుగు వేయాల‌ని భావిస్తున్న భార‌త్ వ‌రుస విజ‌యాల‌తో జోరుమీద ఉంది. మ‌రో ప‌క్క‌, త‌మ బ‌జ్‌బాల్ ప్ర‌యోగం విక‌టించంతో ఎటూ పాలుపోని ఇంగ్లండ్‌, అయినా కానీ, త‌న వ్యూహాన్ని వ‌దిలిపెట్టేది లేద‌ని ధీమాగా చెబుతోంది. కోచ్ మెక్‌క‌ల్ల‌మ్‌, సార‌థి బెన్ స్టోక్స్ ఈ మేర‌కు త‌మ గేమ్‌ప్లాన్‌ను మార్చ‌బోమ‌ని చెప్పారు.

కాగా, ఆఖ‌రి మ్యాచ్‌లో పాల్గొనే జ‌ట్టు స‌భ్యులంద‌రూ ఇప్ప‌టికే ధ‌ర్మ‌శాల‌కు చేరుకోగా, నేడు సార‌థి రోహిత్‌శ‌ర్మ ఊహించ‌ని రీతిలో ఎంట్రీ ఇచ్చి అంద‌రినీ స‌ర్‌ప్రైజ్ చేసాడు. రోహిత్ గ్రాండ్‌గా హెలీకాప్ట‌ర్‌లో గ్రౌండ్‌లోనే దిగాడు. అంత‌కుముందు కేంద్ర క్రీడాశాఖామంత్రి అనురాగ్ ఠాకూర్‌తో క‌లిసి భిలాస్‌పూర్‌లో ఒక ఈవెంట్లో పాల్గొన్న రోహిత్‌, త‌న అభిమానుల‌తో క్రికెట్ ఆడి వారిని అల‌రించాడు.

ఇక‌, ఈ మ్యాచ్ ప్ర‌త్యేకం కాబోతున్న ఆట‌గాళ్లు ఎవ‌రో తెలుసా.. భార‌త్ నుండి ర‌విచంద్ర‌న్ అశ్విన్‌, ఇంగ్లండ్ నుండి జానీ బెయిర్‌స్టో. ఈ ఇద్ద‌రు ప్లేయ‌ర్ల‌కు ఇది వందో మ్యాచ్‌. ఎంతో చిర‌స్మ‌ర‌ణీయ‌మైన ఈ గేమ్ వారిద్ద‌రినీ బాగా ఉత్సాహ‌ప‌రుస్తున‌డంలో ఏమాత్రం సందేహం లేదు. ఇలా ఒకే మ్యాచ్ ఆట‌గాళ్ల‌కు వందో మ్యాచ్‌గా మార‌డం ఇది నాలుగోసారి.

మొద‌టిది 2000వ సంవ‌త్స‌రంలో ఇంగ్లండ్‌-వెస్టిండీస్ జ‌ట్ల మ‌ధ్య ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో జ‌రిగిన మ్యాచ్‌. ఇది ఇంగ్లండ్ సార‌థి మైఖేల్ ఆథ‌ర్‌ట‌న్‌, అలెక్ స్టివార్ట్‌ల‌కు వందో మ్యాచ్‌.

రెండోది, ముచ్చ‌ట‌గా ముగ్గురికి వందో మ్యాచ్‌గా మారింది. ద‌క్షిణాఫ్రికాకు చెందిన షాన్ పొలాక్‌, జాక్ క‌లిస్‌లు, న్యూజిలాండ్ ఆట‌గాడు స్టీఫెన్ ఫ్లెమింగ్‌లు ద‌క్షిణాఫ్రికా-న్యూజీలాండ్ మ‌ధ్య 2006లో సెంచురియ‌న్‌లో జ‌రిగిన మ్యాచ్‌ను త‌మ వందో మ్యాచ్‌గా ఆడారు.

ఇక మూడోది, 2013లో యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌-ఆసీస్‌ల మ‌ధ్య జ‌రిగిన పోరు. ఇది ఇంగ్లండ్ ఆట‌గాడు అలిస్ట‌ర్ కుక్‌, ఆస్ట్రేలియా ఆట‌గాడు మైఖేల్ క్లార్క్‌ల‌కు వందో గేమ్‌.

రేపు జ‌ర‌గ‌బోయే మ్యాచ్‌, ఇలా నాలుగో మ్యాచ్ కాబోతోంది. ఇందులో ఇంకో ప్ర‌త్యేక‌త కూడా ఉంది. ప్ర‌త్య‌ర్థి జ‌ట్ల నుండి చెరొక‌రు ఒకే మ్యాచ్‌ను వందో మ్యాచ్‌గా అడ‌టం ఇది రెండ‌వ‌సారి మాత్ర‌మే. ఈ మ్యాచ్ మొద‌లైన మ‌రుస‌టి రోజు అంటే 8వ తేదీన మ‌రో ఇద్ద‌రు ఆట‌గాళ్లు ఒకే మ్యాచ్‌ను త‌మ వందో మ్యాచ్‌గా ఆడ‌బోతున్నారు. వారు న్యూజీలాండ్‌కు చెందిన టిమ్ సౌథీ, కేన్ విలియ‌మ్‌స‌న్‌. ఈ మ్యాచ్ ఆస్ట్రేలియాతో జ‌ర‌గ‌బోతోంది.