Indian Army | ఐఎస్ఐకి భార‌త ఆర్మీ స‌మాచారం

Indian Army డ్ర‌గ్స్ స్మ‌గ్ల‌ర్ ద్వారా సైనికుడి చేర‌వేత‌ ఇద్ద‌రినీ అరెస్టు చేసిన పంజాబ్ పోలీసులు ఐదుసార్లు సున్నిత సమాచారం పంపిణీ విధాత‌: డ్ర‌గ్ స్మ‌గ్ల‌ర్ ద్వారా భార‌త ఆర్మీకి సంబంధించిన సున్నితమైన స‌మాచారాన్ని పాకిస్థాన్‌కు చేర‌వేస్తున్న సైనికుడిని పంజాబ్‌లోని పాటియాలా పోలీసులు బుధ‌వారం అరెస్టు చేశారు. ఇటీవ‌ల డ్ర‌గ్ స్మ‌గ్ల‌ర్‌ను అరెస్టు చేసి ద‌ర్యాప్తు జ‌రుప‌గా ఈ విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. స్మ‌గ్ల‌ర్ సెల్‌ఫోన్‌లో భార‌త ఆర్మీకి సంబంధించిన కీల‌క స‌మాచారం ఉన్న‌ట్టు తెలిసింది. ఇదంతా […]

Indian Army | ఐఎస్ఐకి భార‌త ఆర్మీ స‌మాచారం

Indian Army

  • డ్ర‌గ్స్ స్మ‌గ్ల‌ర్ ద్వారా సైనికుడి చేర‌వేత‌
  • ఇద్ద‌రినీ అరెస్టు చేసిన పంజాబ్ పోలీసులు
  • ఐదుసార్లు సున్నిత సమాచారం పంపిణీ

విధాత‌: డ్ర‌గ్ స్మ‌గ్ల‌ర్ ద్వారా భార‌త ఆర్మీకి సంబంధించిన సున్నితమైన స‌మాచారాన్ని పాకిస్థాన్‌కు చేర‌వేస్తున్న సైనికుడిని పంజాబ్‌లోని పాటియాలా పోలీసులు బుధ‌వారం అరెస్టు చేశారు. ఇటీవ‌ల డ్ర‌గ్ స్మ‌గ్ల‌ర్‌ను అరెస్టు చేసి ద‌ర్యాప్తు జ‌రుప‌గా ఈ విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. స్మ‌గ్ల‌ర్ సెల్‌ఫోన్‌లో భార‌త ఆర్మీకి సంబంధించిన కీల‌క స‌మాచారం ఉన్న‌ట్టు తెలిసింది. ఇదంతా పాకిస్థాన్‌కు చేర‌వేసిన‌ట్టు తెలుస్తున్న‌ది. గురువారం నిందితుడైన సైనికుడిని కూడా అరెస్టు చేసిన‌ట్టు పోలీసులు వెల్ల‌డించారు.

పాటియాలా ఎస్ఎస్పీ వ‌రుణ్ శర్మ గురువారం మీడియాతో మాట్లాడుతూ.. “మేము అమ్రిక్ అనే డ్రగ్ స్మగ్లర్‌ను అరెస్టు చేశాం. అతడి ఫోన్‌ను ప‌రిశీలించ‌గా సైన్యానికి సంబంధించిన సున్నితమైన సమాచారం ల‌భించింది. విచారణలో అతను మన్‌ప్రీత్ శర్మ అనే సైనికుడి నుంచి ఈ సమాచారం పొందిన‌ట్టు చెప్పాడు. మా పోలీస్ టీమ్ మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో సైనికుడిని కూడా అరెస్టు చేసింది. ఆర్మీ స‌మాచారం తానే అమ్రిక్‌కు ఇచ్చానని అంగీకరించాడు. ఆర్మీ సున్నిత స‌మాచారం పాకిస్థాన్‌తో పంచుకున్నట్టు మా ప్రాథమిక దర్యాప్తులో వెల్ల‌డైంది” అని వివ‌రించారు.

గ‌డిచిన కొన్నేండ్ల‌లో ఐదుసార్లు ఇండియన్ ఆర్మీ స‌మాచారం ఐఎస్ఐకి చేర‌వేసిన‌ట్టు ద‌ర్యాప్తులో తేలింది. భార‌త ఆర్మీ ఇంటెలిజెన్స్ విభాగం, ఐబీ పోలీసులు మన్‌ప్రీత్ శర్మను అదుపులోకి తీసుకొని అన్నికోణాల్లో ద‌ర్యాప్తు చేస్తున్నారు. పాటియాలా జిల్లాలోని బ‌ల్వేహ్రా గ్రామానికి చెందిన మన్‌ప్రీత్ శర్మ(27) ప‌ఠాన్‌కోట్‌, చండిమందిర్‌లో ఆర్మీ కేంద్ర కార్యాల‌యంలో ప‌నిచేశాడు. ఆ స‌మ‌యంలో ఇండియ‌న్ ఆర్మీ కంప్యూట‌ర్ల నుంచి సున్నిత స‌మాచారాన్ని సేక‌రించాడు. దానిని డ్ర‌గ్ స్మ‌గ్ల‌ర్ ద్వారా పాకిస్థాన్‌కు చేర‌వేశాడు.