Indian Consulate | భార‌త కాన్సులేట్‌కు నిప్పంటించిన ఖ‌లిస్తాన్ మ‌ద్ద‌తుదారులు.. ఖండించిన అమెరికా

Indian Consulate | అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోల‌ని భార‌త కాన్సులేట్ కార్యాల‌యంపై ఖ‌లిస్తాన్ మ‌ద్ద‌తుదారులు దాడి చేశారు. కార్యాల‌యానికి నిప్పంటించారు. మంట‌ల‌ను శాన్‌ఫ్రాన్సిస్కో ఫైర్ డిపార్ట్‌మెంట్ ఆర్పివేసింది. ఈ దాడి ఆదివారం తెల్ల‌వారుజామున 1:30 గంట‌ల నుంచి 2:30 గంట‌ల మ‌ధ్య జ‌రిగిన‌ట్లు దియా టీవీ పేర్కొంది. అయితే భార‌త కాన్సులేట్‌పై దాడిని అమెరికా ప్ర‌భుత్వం తీవ్రంగా ఖండించింది. అమెరికాలోని ఇత‌ర దేశాల దౌత్య కార్యాల‌యాల‌ను, ఆయా దేశాల దౌత్య‌వేత్త‌ల‌పై దాడులు చేయ‌డం స‌రి కాద‌ని అమెరికా స్ప‌ష్టం […]

Indian Consulate | భార‌త కాన్సులేట్‌కు నిప్పంటించిన ఖ‌లిస్తాన్ మ‌ద్ద‌తుదారులు.. ఖండించిన అమెరికా

Indian Consulate | అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోల‌ని భార‌త కాన్సులేట్ కార్యాల‌యంపై ఖ‌లిస్తాన్ మ‌ద్ద‌తుదారులు దాడి చేశారు. కార్యాల‌యానికి నిప్పంటించారు. మంట‌ల‌ను శాన్‌ఫ్రాన్సిస్కో ఫైర్ డిపార్ట్‌మెంట్ ఆర్పివేసింది. ఈ దాడి ఆదివారం తెల్ల‌వారుజామున 1:30 గంట‌ల నుంచి 2:30 గంట‌ల మ‌ధ్య జ‌రిగిన‌ట్లు దియా టీవీ పేర్కొంది.

అయితే భార‌త కాన్సులేట్‌పై దాడిని అమెరికా ప్ర‌భుత్వం తీవ్రంగా ఖండించింది. అమెరికాలోని ఇత‌ర దేశాల దౌత్య కార్యాల‌యాల‌ను, ఆయా దేశాల దౌత్య‌వేత్త‌ల‌పై దాడులు చేయ‌డం స‌రి కాద‌ని అమెరికా స్ప‌ష్టం చేసింది. ఇది నేర‌పూరిత చ‌ర్య‌లు అంటూ అమెరికా ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. అయితే కాన్సూలేట్‌లో పెద్ద‌గా నష్టం జ‌ర‌గ‌లేదు. ఎవ‌రికీ గాయాలు కాలేదు.

ఈ దుశ్చ‌ర్య‌కు సంబంధించిన వీడియోను ఖ‌లిస్తాన్ మ‌ద్ద‌తుదారులు విడుద‌ల చేశార‌ని, దీనికి ఎలాంటి ధ్రువీక‌ర‌ణ లేద‌ని మీడియా క‌థ‌నాలు వెల్ల‌డించాయి. ఆ వీడియోలో.. హింస హింస‌ను ప్రేరేపిస్తుంద‌నే వ్యాఖ్య‌ల‌తో పాటు ఇటీవ‌ల కెన‌డాలో మృతి చెందిన ఖ‌లిస్తాన్ టైగ‌ర్ ఫోర్స్ చీఫ్ హ‌ర్దీప్ సింగ్ నిజ్జ‌ర్‌కు సంబంధించిన వార్తా క‌థ‌న‌మూ క‌నిపించింది. గ‌త నెల‌లో ఖ‌లిస్తాన్ నేత హ‌ర్దీప్ పోలీసుల కాల్పుల్లో హ‌త‌మైన విష‌యం తెలిసిందే.