Indian Passport | భారతీయ పాస్‌పోర్ట్‌ బలం పెరిగింది..! వీసా లేకుండా 62 దేశాలకు వెళ్లొచ్చు..!

భారతీయ పాస్‌పోర్టు బలం మరోసారి పుంజుకున్నది. హెన్లీ పాస్‌పోర్ట్‌ ఇండెక్స్‌లో భారత దేశం పాస్‌పోర్ట్‌ ర్యాకింగ్‌ మెరుగుపడింది. ప్రస్తుతం జాబితాలో భారతీయ పాస్‌పోర్ట్‌ 82వ స్థానంలో నిలిచింది.

Indian Passport | భారతీయ పాస్‌పోర్ట్‌ బలం పెరిగింది..! వీసా లేకుండా 62 దేశాలకు వెళ్లొచ్చు..!

Indian Passport | భారతీయ పాస్‌పోర్టు బలం మరోసారి పుంజుకున్నది. హెన్లీ పాస్‌పోర్ట్‌ ఇండెక్స్‌లో భారత దేశం పాస్‌పోర్ట్‌ ర్యాకింగ్‌ మెరుగుపడింది. ప్రస్తుతం జాబితాలో భారతీయ పాస్‌పోర్ట్‌ 82వ స్థానంలో నిలిచింది. హెన్లీ పాస్‌పోర్ట్‌ ఇండెక్స్‌ నెలవారీగా అప్‌డేట్‌ అవుతుంది. ఈ ఇంతకు ముందు ఫిబ్రవరిలో ఇండియన్‌ పాస్‌పోర్ట్‌ 85వ స్థానానికి పడిపోయింది. తాజాగా మాడు స్థానాలు ఎగబాకి 82వ స్థానానికి చేరింది. ప్రపంచంలోని వివిధ దేశాల పాస్‌పోర్ట్‌ల బలాన్ని బట్టి.. పలు దేశాలు వీసా రహిత ప్రవేశాన్ని అందిస్తున్నాయి.


హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ 2024లో భారతదేశ ర్యాంకు మెరుగుపడినా జనవరి కంటే తక్కువగా ఉన్నది. ఫిబ్రవరిలో 85వ స్థానానికి పడిపోగా.. అంతకుముందు జనవరిలో ఇండియన్‌ పాస్‌పోర్ట్‌ 80వ స్థానంలో కొనసాగింది. ఇక మన పాస్‌పోర్ట్‌తో 62 దేశాలకు వీసా లేకుండానే ప్రయాణం సాగించే వీలున్నది. ఈ దేశాల జాబితాలో శ్రీలంక, థాయ్‌లాండ్‌, కెన్యా ఉన్నాయి. అలాగే, భూటాన్, బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్, బార్బడోస్, జోర్డాన్, మలేషియా, మాల్దీవులు, మారిషస్, ఇండోనేషియా తదితర దేశాలున్నాయి.

తొలి స్థానంలో ఆరుదేశాలు..

భారతదేశం ప్రధాన ఆర్థిక శక్తిగా ఎదుగుతోంది. ఇది భారతీయ పాస్‌పోర్ట్‌కు కూడా ప్రయోజనం చేకూరుస్తోంది. భారతీయ పాస్‌పోర్ట్ బలం పెరుగుతూ వస్తున్నది. 2022లో భారత్‌ పోస్‌పోర్ట్‌ ర్యాంకు హెన్లీ ఇండెక్స్‌లో 87వ స్థానంలో ఉండగా.. 2023 నాటికి 80వ స్థానానికి చేరింది. తాజాగా 82వ స్థానంలో స్థిరపడింది. అయితే, గత ఏడాదితో పోలిస్తే భారతీయ పాస్‌పోర్ట్‌కు వీసా రహిత యాక్సెస్ ఇచ్చే దేశాల సంఖ్యలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు.

ఇక హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ ప్రకారం.. అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్‌లలో ఆరు దేశాలు సంయుక్తంగా మొదటి స్థానంలో నిలిచాయి. ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, సింగపూర్, స్పెయిన్ దేశాల పేర్లు సంయుక్తంగా మొదటి స్థానంలో ఉన్నాయి. ఈ దేశాల పాస్‌పోర్ట్‌లు ఉన్నవారు వీసా లేకుండా 194 దేశాలను సందర్శించేందుకు వీలుంటుంది. ఫిన్లాండ్, నెదర్లాండ్స్, స్వీడన్, దక్షిణ కొరియా 193 దేశాలకు వీసా రహిత యాక్సెస్‌తో రెండో స్థానంలో ఉండగా.. ఆస్ట్రియా, డెన్మార్క్, ఐర్లాండ్, బ్రిటన్, లక్సెంబర్గ్ 192 దేశాలకు వీసా రహిత యాక్సెస్‌తో మూడో స్థానంలో నిలిచాయి.

62 దేశాలకు వీసా ఫ్రీ ఎంట్రీ..

భారతీయ పాస్‌పోర్ట్ హోల్డర్లకు 62 దేశాల్లో ‘వీసా ఆన్‌ అరైవల్‌’ సౌకర్యం ఉంటుంది. వీసా లేకుండా ఆ దేశానికి వెళ్లి.. అక్కడి విమానాశ్రయంలో వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అక్కడికక్కడే, విమానాశ్రయంలోనే ఆ దేశ వీసా లభిస్తుంది. దీన్నే ‘వీసా ఆన్ అరైవల్’గా పిలుస్తారు. ఈ దేశాల జాబితాలో అంగోలా, బార్బడోస్, కేప్ వెర్డే దీవులు, కొమొరో దీవులు, గాబోన్

గ్రెనడా, గినియా-బిస్సావు, హైతీ, ఇండోనేషియా, ఇరాన్, జమైకా, కుక్ దీవులు, జిబౌటి, డొమినికా, భూటాన్, బొలీవియా, బ్రిటిష్ వర్జిన్ దీవులు, బురుండి, కంబోడియా, ఎల్ సల్వడార్, ఇథియోపియా, ఫిజీ, జోర్డాన్, కజకిస్తాన్, కెన్యా, కిరిబాటి, లావోస్, మకావో (SAR చైనా), మడగాస్కర్, మలేషియా, మాల్దీవులు, మార్షల్ దీవులు, మౌరిటానియా, మారిషస్, మైక్రోనేషియా

మోంట్సెరాట్, మొజాంబిక్, మయన్మార్, నేపాల్, నియు, ఒమన్, పలావు దీవులు, ఖతార్, రువాండా, సమోవా, సెనెగల్, సీషెల్స్, సియర్రా లియోన్, సోమాలియా, శ్రీలంక, సెయింట్ కిట్స్ అండ్‌ నెవిస్, సెయింట్ లూసియా, సెయింట్ విన్సెంట్ అండ్‌ గ్రెనడైన్స్, టాంజానియా, థాయిలాండ్, తైమూర్-లెస్టే, టుగో, ట్రినిడాడ్ అండ్‌ టొబాగో, ట్యునీషియా, తువాలు, వనాటు, జింబాబ్వే దేశాలున్నాయి.